News February 7, 2025

ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం

image

TG: ఇంటర్ ప్రాక్టికల్స్‌కు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. అనారోగ్యం లేదా అత్యవసర కారణాల వల్ల నిర్ణీత తేదీల్లో పరీక్షలకు హాజరు కాని వారికి మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు ఛాన్స్ ఇవ్వనుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం విద్యార్థులు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీని సంప్రదించాలని సూచించింది. ఈనెల 22తో ఇంటర్ ప్రాక్టికల్స్ ముగియనున్నాయి.

Similar News

News March 27, 2025

కన్నడిగులకు మరో షాక్!

image

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పాల ధరలను లీటరుకు రూ.4 పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మిల్క్ ధరలను లీటరుకు రూ.5 పెంచాలని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) కోరగా సీఎం సిద్దరామయ్య రూ.4 పెంచేందుకు అంగీకరించారు. ఇటీవలే అక్కడ కరెంట్ ఛార్జీలను పెంచారు. 6 గ్యారంటీలే ధరల పెరుగుదలకు కారణమని విపక్షాలు మండిపడుతున్నాయి.

News March 27, 2025

కిలో రూ.3.. కష్టాల్లో టమాటా రైతులు

image

TG: గిట్టుబాటు ధరలు లేక, కిలో టమాటా రూ.3కే అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. రంగారెడ్డి (D) కొందుర్గ్ (M) రైతు నర్సింహులు 56 టమాటా పెట్టెలు(ఒక్కోదాంట్లో 30kg) మహబూబ్‌నగర్ రైతు‌బజారుకు తీసుకెళ్లారు. 39పెట్టెలకు దళారులు రూ.3,500 చెల్లించారు. మిగతావి కొనకపోవడంతో టమాటాలను రోడ్డుపక్కన పారబోస్తూ ఆవేదన చెందారు. మరోవైపు, బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ.10- రూ.20 వరకు ఉంది.

News March 27, 2025

‘తెలుగు నేర్చుకో..’ అక్బరుద్దీన్ ఒవైసీపై మాజీ ఐఏఎస్ ఫైర్

image

TG: ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే <<15896404>>అక్బరుద్దీన్‌పై<<>> మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ ఫైరయ్యారు. ‘మంత్రి సీతక్కకు హిందీ రాదు సరే.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన నీకు తెలుగు ఎందుకు రాదు?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే తొలి అధికార భాష తెలుగును నేర్చుకోవాలనే బాధ్యత ఉండాలని హితవు పలికారు. తెలుగు రానప్పుడు సభ్యులు లేవనెత్తే సమస్యలు ఎలా అర్థమవుతాయని దుయ్యబట్టారు.

error: Content is protected !!