News October 22, 2024
ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి మరో పోస్టర్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి మేకర్స్ మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మంట అంటుకున్న సింహాసనాన్ని తలకిందులుగా చూపించారు. రేపు డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త అప్‌డేట్ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ మారుతి తెలిపారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.
Similar News
News November 15, 2024
తెలుగు టైటాన్స్ ఓటమి
ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11లో భాగంగా UP యోధాస్‌తో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఓడింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 20-16తో ఆధిక్యం కనబర్చింది. అయితే ఆ తర్వాత UP ఆటగాళ్లు పుంజుకున్నారు. చివరికి UP 40 పాయింట్లు సాధించగా టైటాన్స్ 34 పాయింట్లకే పరిమితమైంది. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్(32)పై U ముంబా(35) గెలిచింది. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో హరియాణా ఉండగా టైటాన్స్ 6వ స్థానంలో ఉంది.
News November 15, 2024
ఈ నెల 19న ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన
TG: ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలకు సీఎం రేవంత్ వరంగల్ వేదికగా ఈ నెల 19న శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భవనాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాపాలన-విజయోత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో సీఎం పాల్గొన్నారు.
News November 15, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.