News May 24, 2024

నాగ్-పూరీ జగన్నాథ్ కాంబోలో మరో ప్రాజెక్ట్?

image

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రామ్ పోతినేనితో ‘డబుల్ ఇస్మార్ట్’ షూట్ తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో శివమణి, సూపర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News February 19, 2026

ఏ రాశివారు ఎన్ని వత్తుల దీపం వెలిగించాలంటే?

image

మేష రాశి – త్రివత్తులు(3), వృషభ రాశి – చతుర్‌వత్తులు (4), మిథున రాశి – సప్తమవత్తులు (7), కర్కాటక రాశి – త్రివత్తులు(3), సింహ రాశి – పంచమవత్తులు (5), కన్య రాశి – చతుర్‌వత్తులు (4), తులా రాశి – షణ్ముఖ వత్తులు (6), వృశ్చిక రాశి – పంచమవత్తులు (5), ధనుస్సు రాశి – త్రివత్తులు(3), మకర రాశి – సప్తమవత్తులు (7), కుంభ రాశి – చతుర్‌వత్తులు (4), మీన రాశి – పంచమవత్తులు (5).

News February 19, 2026

1399 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

IOCLకు చెందిన వివిధ రిఫైనరీలలో 1399 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పానిపట్ రిఫైనరీలో 637, మథుర రిఫైనరీలో 108, బొంగైగావ్ రిఫైనరీలో 88, గుజరాత్ రిఫైనరీలో 566 పోస్టులు ఉన్నాయి. BSc/BA/B.Com, టెన్త్+ITI, ఇంటర్, డిప్లొమా అర్హత గల వారు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18-24ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com

News February 19, 2026

అరటి సాగుకు మేలైన రకాలు

image

అరటి ఉత్పత్తిలో దేశంలోనే AP తొలిస్థానంలో ఉంది. ఈ పంట సాగుకు సారవంతమైన తగిన నీటి వసతి కలిగిన భూమి అనుకూలం. అలాగే నీరు ఇంకిపోయే గుణంతో పాటు తగిన సేంద్రియ పదార్థము గల నేలలు అనుకూలం. పండ్ల కోసం కర్పూర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, గ్రాండ్‌నైన్, పొట్టి పచ్చ అరటి.. కూర కోసం కొవ్వూరు బొంత, గోదావరి బొంత రకాలు అనుకూలం. తెల్ల చక్కెరకేళి, కర్పూర చక్కెరకేళి, బొంత రకాలను ఏడాది పొడవునా నాటవచ్చు.