News May 24, 2024
నాగ్-పూరీ జగన్నాథ్ కాంబోలో మరో ప్రాజెక్ట్?

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో మరో మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రామ్ పోతినేనితో ‘డబుల్ ఇస్మార్ట్’ షూట్ తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా గతంలో వీరిద్దరి కాంబినేషన్లో శివమణి, సూపర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News February 6, 2025
బీజేపీకి 45-55 సీట్లు: యాక్సిస్ మై ఇండియా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది. బీజేపీ 45-55, ఆప్ 15-25, కాంగ్రెస్ 0-1, ఇతరులు 0-1 సీట్లు గెలుస్తాయని పేర్కొంది. 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు అవసరం.
News February 6, 2025
₹61,500 బదులు ₹10,000 Income Tax చెల్లిస్తే చాలు..

₹12L వరకు ట్యాక్స్ లేదు. దానిపై జస్ట్ ₹10వేలు పెరిగితే, అంటే ₹12.10L అయితే ₹61,500 పన్ను చెల్లించాలేమోనని కొందరు కంగారు పడుతున్నారు. వీరికి సెక్షన్ 87A ప్రకారం మార్జినల్ రిలీఫ్ ఉంటుంది. మొత్తం పన్ను (61,500)లో పెరిగిన శాలరీ (10000)ని తీసేయగా మిగిలిన మొత్తం రిబేట్ (51,500) వస్తుంది. దానిని ₹61,500 నుంచి తీసేస్తే మిగిలిన ₹10000 మాత్రమే పన్నుగా చెల్లించాలి. ఇలా ₹51,500 ఆదా చేసుకోవచ్చు. Share It.
News February 6, 2025
తెలుగులోనూ జీవోలు.. ఇలా చూసేయండి!

AP: రాష్ట్ర ప్రభుత్వం అధికార సైట్లో ఇంగ్లిష్తో పాటు తెలుగులో జీవోలను అప్లోడ్ చేస్తోంది. <