News March 23, 2025
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

టీ20 ఫార్మాట్లో 400 మ్యాచులు ఆడిన మూడో భారత ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. KKRతో జరిగిన మ్యాచుతో ఈ ఘనత అందుకున్నారు. అతనికంటే ముందు రోహిత్ శర్మ(448), దినేశ్ కార్తీక్ (412) ఈ ఫీట్ సాధించారు. కాగా టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన లిస్టులో కోహ్లీ (12,945) ఐదో స్థానంలో ఉన్నారు. గేల్ (14,562), హేల్స్ (13,610), షోయబ్ (13,537), పొలార్డ్ (13,537) తొలి 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.
Similar News
News March 24, 2025
ఈవారం కొత్త సినిమాలు!

ఉగాది పండుగ వేళ బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సినిమాలు సిద్ధమవుతున్నాయి.
థియేటర్ రిలీజ్: మార్చి 27న మోహన్‌లాల్ ‘ఎల్2 ఎంపురాన్’, విక్రమ్ ‘వీర ధీర శూర’. 28న నితిన్ ‘రాబిన్ హుడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’. 30న సల్మాన్ ఖాన్ ‘సికందర్’.
ఓటీటీ: JIO హాట్‌స్టార్‌లో ‘ముఫాసా: ది లయన్ కింగ్(మార్చి 26), జీ5లో విడుదల పార్ట్-2(మార్చి 28), నెట్‌ఫ్లిక్స్‌లో మిలియన్ డాలర్ సీక్రెట్ (మార్చి 26).
News March 24, 2025
నేను సభకు రావొద్దని రాసివ్వండి: జగదీశ్ రెడ్డి

TG: ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సస్పెండ్ అయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ అసెంబ్లీకి వెళ్లగా సభలోకి రావొద్దని చీఫ్ మార్షల్ సూచించారు. దీంతో స్పీకర్ ఇచ్చిన బులెటిన్ చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను సభకు రావొద్దని రాతపూర్వకంగా రాసివ్వాలన్నారు. లేకపోతే అక్కడే కూర్చొని నిరసన తెలుపుతానని చెప్పారు. మరోవైపు BRS ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి వచ్చారు. రుణమాఫీ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.
News March 24, 2025
వైజాగ్-సికింద్రాబాద్ ట్రైన్ అలర్ట్

TG: వైజాగ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా వెళ్లే నాలుగు రైళ్లను చర్లపల్లి టెర్మినల్ మీదుగా మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లోక్మాన్య తిలక్ , సంబల్ పూర్ సూపర్ ఫాస్ట్, విశాఖ-నాందేడ్, విశాఖ-సాయినగర్ వీక్లీ ఎక్స్‌ప్రైస్‌ల రూటు మార్చనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 22నుంచి ఈ మార్పులు చేపట్టనున్నారు. దారి మళ్లించడంతో అదనపు ప్రయాణం తమకు భారమవుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.