News May 27, 2024

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ పేరిట మరో రికార్డు

image

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు(2) ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న భారత ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పారు. 2016లో 973 రన్స్, 2024 సీజన్‌లో 741 రన్స్ చేసి కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచారు. గతంలో వార్నర్ 3 సార్లు, గేల్ 2 సార్లు ఈ ఘనత సాధించారు. ఈ సీజన్‌లో వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌ చేరిన ఆర్సీబీ, ఎలిమినేటర్‌లో నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

Similar News

News February 8, 2025

ఢిల్లీ నుంచి గల్లీకి చేరిన కేజ్రీవాల్

image

నిన్నటివరకు మోదీకి ఎదురునిలిచే నేతల్లో కేజ్రీవాల్ ఒకరు. ప్రస్తుతం మాత్రం ఆప్‌తో పాటు తానూ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో పరిస్థితి తలకిందులుగా మారింది. పంజాబ్‌లో అధికారంతో పాటు పలురాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు గెలిచి జోరుమీదున్న ఆప్‌కు ఢిల్లీ ఓటమి కోలుకోలేని దెబ్బ. లిక్కర్ స్కాం,శీశ్‌మహాల్, యమున నది కలుషితం తదితర అంశాలతో పాటు సొంత పార్టీ నేతల్లో వ్యతిరేకత తదితర అంశాలు కేజ్రీవాల్ ఓటమికి కారణమయ్యాయి.

News February 8, 2025

‘అఖండ-2’లో విలన్‌గా క్రేజీ యాక్టర్?

image

సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించిన నటుడు ఆది పినిశెట్టి మరోసారి బోయపాటి శ్రీను మూవీలో విలన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బోయపాటి తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’లో ప్రతినాయకుడి పాత్రలో ఆది కనిపిస్తారని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి తెరకెక్కించిన ‘సరైనోడు’ సినిమాలో ఆది విలనిజంకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

News February 8, 2025

ఢిల్లీ రిజల్ట్స్: అత్యధిక మెజారిటీ ఎవరికంటే?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ(మటియా మహల్- 42,724 ఓట్లు)తో ఆప్ నేత మహమ్మద్ ఇక్బాల్ బీజేపీ అభ్యర్థి దీప్తిపై విజయం సాధించారు. మరోవైపు అత్యల్ప మెజార్టీ(344 ఓట్లు)తో సంగం విహార్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి చందన్ కుమార్ నెగ్గారు. ఓవరాల్‌గా ముగ్గురు BJP అభ్యర్థులు వెయ్యి లోపు మెజార్టీతో విజయం సాధించారు. పలు చోట్ల మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడటం గమనార్హం.

error: Content is protected !!