News December 15, 2024

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక క్యాచులు అందుకున్న మూడో ప్లేయర్‌గా కోహ్లీ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 117 క్యాచులు అందుకున్నారు. ఈ క్రమంలో సచిన్ (115) రికార్డును ఆయన అధిగమించారు. అగ్ర స్థానంలో రాహుల్ ద్రవిడ్ (210) ఉన్నారు. ఆ తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ (135) కొనసాగుతున్నారు. కాగా మూడో టెస్టులో విరాట్ 2 క్యాచులు అందుకున్నారు.

Similar News

News January 19, 2025

kg చికెన్ ధర ఎంతో తెలుసా?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. HYDలో కేజీ స్కిన్ లెస్ ధర రూ.220-230గా ఉంది. అటు ఏపీలోని చాలా ప్రాంతాల్లో రూ.240 వరకు ఉంది. లైవ్ బర్డ్ కేజీ రేటు రూ.117గా కొనసాగుతోంది. 12 కోడిగుడ్ల రిటైల్ ధర రూ.70గా ఉంది.

News January 19, 2025

WK ఎంపికపై గంభీర్, రోహిత్ మధ్య డిబేట్?

image

ఛాంపియన్స్ ట్రోఫీ <<15185531>>జట్టు<<>> ఎంపిక సమయంలో హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హార్దిక్‌ను వైస్ కెప్టెన్ చేయాలని, సెకండ్ వికెట్ కీపర్‌గా శాంసన్‌ను తీసుకోవాలని గంభీర్ సూచించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కానీ VCగా గిల్, WKగా పంత్‌ను తీసుకోవడానికే చీఫ్ సెలక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ మొగ్గు చూపినట్లు తెలిపింది.

News January 19, 2025

రేషనలైజేషన్‌ను తప్పుబడుతోన్న ఉద్యోగ సంఘాలు

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపట్టాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని వల్ల ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. మల్టీపర్పస్ ఉద్యోగులు అనే పేరుతో వివిధ పనులకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలనుకోవడం సరికాదని పేర్కొన్నాయి.