News September 4, 2024
4G కోసం BSNLకు మరో రూ.6000 కోట్లు
BSNLకు మరో రూ.6వేల కోట్లు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది. కస్టమర్లను పోగొట్టుకోకుండా వేగంగా 4G నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లక్ష 4G సైట్లు నెలకొల్పేందుకు కంపెనీ నిరుడు రూ.19వేల కోట్లతో TCS, ITIకి ఆర్డర్లు ఇచ్చింది. రూ.13వేల కోట్లే చెల్లించడంతో మరో రూ.6వేల కోట్లు అవసరం అయ్యాయి. 2019 నుంచి BSNL, MTNLలో కేంద్రం రూ.3.22 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.
Similar News
News September 19, 2024
వేమన నీతి పద్యం- తాత్పర్యం
కర్మ మధికమైన గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి తగని చోట
గంకుభట్టు జేసెగటకటా దైవంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ప్రతికూల సమయం వచ్చినప్పుడు ధర్మరాజు కూడా విరాట రాజువద్ద కంకుభట్టు వేషాన్ని ధరించాల్సి వచ్చింది.
News September 19, 2024
ఈ ఫొటోలోని క్రికెటర్‌ను గుర్తు పట్టారా?
ఈ ఫొటోలో భారత క్రికెట్ గేమ్ ఛేంజర్ ఉన్నారు. ఆడిన తొలి రెండు టెస్టుల్లోనూ సెంచరీలు బాదారు. వన్డేల్లో 10 వేలకుపైగా పరుగులు, 100కుపైగా వికెట్లు, 100కుపైగా క్యాచ్‌లు పట్టారు. ఆయన నాయకత్వంలో వన్డే వరల్డ్ కప్ త్రుటిలో చేజారింది. 100కు పైగా టెస్టులు, 300కు పైగా వన్డేలు ఆడారు. ఐపీఎల్‌లో PWI, KKRకు ప్రాతినిథ్యం వహించారు. ఆయన ఎవరో గుర్తు పట్టి కామెంట్ చేయండి.
News September 19, 2024
మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్
UPలోని బృందావన్ రోడ్ స్టేషన్ సమీపంలో బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. 20 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనతో ఢిల్లీ-మథుర మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యుద్ధప్రాతిపదికన ఆ రూట్‌ను క్లియర్ చేసేందుకు రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవలకాలంలో దేశంలో వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి.