News June 20, 2024

మరో పథకం పేరు మార్పు

image

AP: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ‘ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్’ పథకంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జగనన్న విద్యాదీవెన పేరును పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌గా, YSR కల్యాణమస్తుని చంద్రన్న పెళ్లి కానుకగా, YSR విద్యోన్నతిని ఎన్టీఆర్ విద్యోన్నతిగా, జగనన్న విదేశీ విద్యాదీవెనను అంబేడ్కర్ ఓవర్సీన్ విద్యా నిధిగా ప్రభుత్వం మార్చింది.

Similar News

News September 11, 2024

సీఎం రేవంత్‌కు రూ.కోటి విరాళం అందజేసిన పవన్

image

TG: వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వంతుగా ప్రకటించిన రూ.కోటి విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ మేరకు రేవంత్‌తో సమావేశమై చెక్కు ఇచ్చారు. ఏపీలోనూ వరద బాధితుల సహాయార్థం తన వంతు సాయంగా రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

News September 11, 2024

ఓటీటీలోకి కొత్త సినిమాలు

image

హరీశ్ శంకర్, రవితేజ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ రేపటి(సెప్టెంబర్ 12) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. అలాగే చిన్న సినిమాగా విడుదలై హిట్‌గా నిలిచిన ‘ఆయ్’ కూడా రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు విక్రమ్ ‘తంగలాన్’ మూవీ ఈనెల 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

News September 11, 2024

రాష్ట్రంలో 8,915కు చేరిన ఎంబీబీఎస్ సీట్లు

image

TG: రాష్ట్రంలో ఈ ఏడాది 8 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. దీంతో మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరగా MBBS సీట్ల సంఖ్య 4,315కు చేరింది. ప్రైవేట్ కాలేజీలతో కలిపి మొత్తంగా ఈ సంఖ్య 8,915గా ఉంది. మరోవైపు కొత్త కాలేజీలకు అనుమతులిచ్చిన కేంద్రానికి, నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌కు వైద్యారోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు.