News January 5, 2025
ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: TDP

AP: ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ ట్వీట్ చేసింది. కోటీ 43 లక్షల పేద కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలు కానుందని వెల్లడించింది. ప్రతి కుటుంబానికి రూ.2,500 వరకు ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొంది.
Similar News
News December 11, 2025
IPL మినీ వేలం.. తొలి సెట్ ఇదే..

ఈ నెల 16న అబుదాబీలో IPL మినీ వేలం జరగనుంది. తొలి సెట్లో వేలానికి వచ్చే ఆటగాళ్ల జాబితా తాజాగా విడుదలైంది. ఇందులో డెవాన్ కాన్వే, జాక్ ఫ్రేజర్, కామెరూన్ గ్రీన్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, పృథ్వీ షా ఉన్నారు. సర్ఫరాజ్, పృథ్వీ షా ధరను రూ.75లక్షలుగా, మిగతా వారి బేస్ ప్రైజ్ను రూ.2కోట్లుగా నిర్ణయించారు. అయితే ఈ వేలంలో గ్రీన్ అత్యధిక ధర పలికే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలంటున్నాయి.
News December 11, 2025
రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం

AP: రూ.9,500 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్భవన్, అసెంబ్లీ దర్బార్ హాలు నిర్మాణానికి ఓకే చెప్పింది. గవర్నర్ ఆఫీస్, స్టాఫ్ క్వార్టర్స్, అతిథిగృహాల నిర్మాణానికి అంగీకారం లభించింది. 26 సంస్థలకు సంబంధించిన రూ.20 వేల కోట్ల పెట్టుబడులను క్యాబినెట్ ఆమోదించింది.
News December 11, 2025
చెరువుల్లో చేపల మరణానికి ప్రధాన కారణం ఇదే

చెరువుల్లో చేపల పెంపకంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఎక్కువ సంఖ్యలో చేపల మరణాలు. దీనికి వ్యాధులే కారణమని చాలా మంది పెంపకందారులు భావిస్తుంటారు. అయితే చెరువుల్లో నీటి నాణ్యత, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే 60-70% చేపల మరణాలు సంభవిస్తున్నాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే చేపల పెంపకందారులు చెరువుల్లో నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.


