News November 24, 2024
గౌతమ్ అదానీకి మరో షాక్

బిలియనీర్ గౌతమ్ అదానీకి మరో షాక్ తగిలింది. సోలార్ విద్యుత్ స్కామ్ ముడుపులకు సంబంధించి అమెరికా SEC(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్) ఆయనకు నోటీసులు జారీ చేసింది. అదానీ నివసించే అహ్మదాబాద్‌లోని శాంతివన్ ఫామ్ చిరునామాకు ఈ నోటీసులు పంపింది. మూడు వారాల్లోగా ముడుపులపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. గౌతమ్‌తోపాటు ఆయన సోదరుడి కుమారుడు సాగర్‌కు కూడా సమన్లు జారీ చేసింది.
Similar News
News March 5, 2026
US దాడి చేస్తే ఇండియాపై నిందలేంటి: అమిత్ మాలవీయ

ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేస్తే ఇండియాను నిందించడంలో లాజిక్ లేదని BJP నేత అమిత్ మాలవీయ విమర్శించారు. ‘భారత తీరానికి 250 నాటికల్ మైళ్ల దూరంలో, సముద్ర పరిధికి అవతల అటాక్ జరిగింది. సమీపంలో ఉన్నంత మాత్రాన ప్రతి ఘటనకు ఆ దేశం బాధ్యత వహించదు. అంతర్జాతీయ జలాల్లో కార్యకలాపాలను IND నియంత్రించదు. US-ఇరాన్ మధ్య జరిగిన దానికి ఇండియాను జవాబుదారీగా చేయాలనుకోవడం సమర్థనీయం కాదు’ అని ట్వీట్ చేశారు.
News March 5, 2026
❤️నచ్చేశావ్ సంజూ..

T20WC: సంజూ శాంసన్ టీమ్ కోసం సెంచరీని కూడా లెక్క చేయలేదు. అతడు ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 13 ఓవర్లలో 160గా ఉంది. అప్పటికే సంజూ 41 బంతుల్లో 89 రన్స్ చేశారు. సెంచరీ ముందు కూడా జట్టుకు భారీ స్కోర్ అందించాలని సిక్సర్ కోసం ట్రై చేశారు. అయితే మిస్ టైమ్ కావడంతో క్యాచ్ ఔటయ్యారు. సంజూ ఆరంభం నుంచి దూకుడుగా ఆడటంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పడలేదు. దీంతో భారత్ ఈజీగా 253 రన్స్ చేసింది.
News March 5, 2026
విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.


