News November 24, 2024
గౌతమ్ అదానీకి మరో షాక్
బిలియనీర్ గౌతమ్ అదానీకి మరో షాక్ తగిలింది. సోలార్ విద్యుత్ స్కామ్ ముడుపులకు సంబంధించి అమెరికా SEC(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్) ఆయనకు నోటీసులు జారీ చేసింది. అదానీ నివసించే అహ్మదాబాద్‌లోని శాంతివన్ ఫామ్ చిరునామాకు ఈ నోటీసులు పంపింది. మూడు వారాల్లోగా ముడుపులపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. గౌతమ్‌తోపాటు ఆయన సోదరుడి కుమారుడు సాగర్‌కు కూడా సమన్లు జారీ చేసింది.
Similar News
News December 4, 2024
రేపే పుష్ప-2 రిలీజ్.. నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్
రేపు పుష్ప-2 రిలీజ్ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించే సినిమా విజయం కావాలని కోరుకుందామన్నారు. ‘అందరినీ అలరించే సినిమాని సినిమాలానే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని, ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను’ అని పోస్ట్ చేశారు. కాగా, అల్లు-మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా ఫైట్ జరుగుతోన్న వేళ ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
News December 4, 2024
రేపు ఈ ప్రాంతాల్లో వర్షాలు
AP: రేపు అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ట్వీట్ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, చిత్తూరులో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
News December 4, 2024
ఇక్కడ అబ్బాయిలు గిన్నెలు తోమి, వంటలు చేయాలి
అమ్మాయిలు ఇంటి పని చేయాలని, అబ్బాయిలు బయట ఆడుకోవచ్చనే కోణాన్ని పిల్లల నుంచి తొలగించేందుకు చెన్నై కార్పొరేషన్ ముందుకొచ్చింది. వారికి లింగ సమానత్వాన్ని నేర్పించేందుకు జెండర్ ఈక్వాలిటీ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఇంట్లో పనులు, గిన్నెలు తోమడం, వంట చేయడం వంటివి నేర్పుతారు. అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో చెప్తారు. చిన్నప్పుడే పిల్లల ఆలోచనా విధానం మార్చితే మార్పులొస్తాయని ఈ నిర్ణయం తీసుకున్నారు.