News February 5, 2025
H1B వీసా హోల్డర్లకు మరో షాక్ తప్పదా!

అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులకు మరో షాక్ తగిలేలా ఉంది. వారి వర్క్ పర్మిట్ వీసా రెన్యూవల్ గడువును 180 నుంచి 540 రోజులకు పెంచుతూ తీసుకున్న జో బైడెన్ నిర్ణయం రద్దు చేసేలా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి ఆమోదం లభిస్తే మళ్లీ ఆ గడువు 180 రోజులకు తగ్గుతుంది. ఫలితంగా వేలాది వలసదారులు, శరణార్థులు, గ్రీన్ కార్డు హోల్డర్లు, H1B వీసా హోల్డర్ల భాగస్వాములపై ప్రభావం పడుతుంది.
Similar News
News September 19, 2025
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ – లక్షణాలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్లో పంటకు సరైన ధర దక్కదు.
News September 19, 2025
23 సీట్లే వచ్చినా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు: పల్లా

AP: అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం బాధగానే ఉందని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు అన్నారు. జగన్ ప్రజా తీర్పును గౌరవించాలని, ఎమ్మెల్యేల సంఖ్య ముఖ్యం కాదని చెప్పారు. ఎమ్మెల్యేల బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సరికాదన్నారు. 2019లో 23 సీట్లే వచ్చినా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్మీట్లలో మాట్లాడతామనడం సరికాదని హితవు పలికారు.
News September 19, 2025
పరమానందయ్య శిష్యుల కథలో పరమార్థం ఇదే!

పరమానందయ్య శిష్యులు వాగు దాటాక తమను తాము లెక్కించుకోని కథ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ హాస్య కథ వెనుక ఓ గొప్ప పరమార్థం ఉంది. 11 మంది శిష్యులు తమను తాము లెక్కించుకోలేక పది మందే ఉన్నామని బాధపడినట్లుగా, మనం కూడా ఆనందం, సత్యం ఎక్కడో బయట ఉంటాయని బాధపడతాం. వాటి కోసం వెతుకుతాం. ‘అహం బ్రహ్మాస్మి’ అంటే ‘నేనే బ్రహ్మ పదార్థం’ అనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడే జీవితం పరిపూర్ణమవుతుందని దీని సారాంశం.