News September 17, 2024
జానీ మాస్టర్‌కు మరో షాక్!
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆ పదవి నుంచి జానీని తొలగించడంతో పాటు అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. జానీ తనను లైంగికంగా వేధించారంటూ ఓ లేడీ డాన్సర్ ఆరోపించడంతో ఇప్పటికే జనసేన పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
Similar News
News October 4, 2024
రేపటిలోగా డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి: సీఎం
TG: ఈనెల 5వ తేదీలోపు అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఎంపికైన 11,062 మంది అభ్యర్థులకు దసరా పండుగలోపు ఈనెల 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే 9,090 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
News October 4, 2024
కోలుకున్న రవితేజ.. దసరా తర్వాత షూటింగ్ షురూ
ఇటీవల షూటింగ్‌లో గాయపడిన రవితేజ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. దసరా తర్వాత ఈ నెల 14 సెట్స్‌లో అడుగుపెడతారని టాలీవుడ్ టాక్. భాను భోగవరపు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రీకరణలో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరీ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తున్నారు.
News October 4, 2024
సురేఖ వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ ఏమందంటే?
TG: సినీ నటి సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారని, లేదంటే దీనిపై తీవ్రంగా స్పందించే వాళ్లమని రాష్ట్ర మహిళా కమిషన్ తెలిపింది. మంత్రి వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించామని, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో తెలిపింది. సురేఖకు అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులిచ్చే అంశం పూర్తిగా వారి వ్యక్తిగతమని పేర్కొంది.