News January 6, 2025
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు మరో షాక్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’కు తమిళనాడులో మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు నిర్వహించదలచిన ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు రాష్ట్రంలో <<15078900>>సినిమా రిలీజ్<<>> కూడా చేయొద్దని లైకా ప్రొడక్షన్స్ సూచించినట్లు తెలిపాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ‘ఇండియన్-2’ ఫ్లాప్ కావడంతో ఈ మూవీపైనే శంకర్ ఆశలు పెట్టుకున్నారు.
Similar News
News January 8, 2025
ఆరోగ్యశ్రీపై చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష?: వైఎస్ జగన్
AP: ఆరోగ్యశ్రీపై సీఎంకు ఎందుకంత కక్ష అంటూ మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘వైద్యానికి ఎంత ఖర్చైనా ప్రజలు ఉచితంగా చికిత్స పొందేలా పథకాన్ని తీర్చిదిద్దాం. దాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు నాశనం చేస్తోంది? నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారు. కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి షూరిటీ లేదు. మీ చర్యల్ని ఖండిస్తున్నా. ఆరోగ్యశ్రీని వెంటనే యథాతథంగా అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
News January 8, 2025
షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్.. పాస్‌పోర్ట్ రద్దు
మాజీ PM షేక్ హసీనా పాస్‌పోర్టును బంగ్లా ప్రభుత్వం రద్దు చేసింది. రిజర్వేషన్లపై చెలరేగిన అల్లర్ల సమయంలో కిడ్నాప్‌లు, హత్యలకు పాల్పడ్డారంటూ ఆమెతోపాటు మరో 11 మందికి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. FEB 12లోగా అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఆమె పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది. బంగ్లాలో అల్లర్ల సమయంలో పారిపోయిన వచ్చిన హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు.
News January 8, 2025
అదృష్టం అంటే ఈ బాలుడిదే..!
చెత్తకుప్పలో దొరికిన చిన్నారి భవితవ్యం మారిపోయింది. లక్నోకు చెందిన రాకేశ్‌ను మూడేళ్ల క్రితం ఎవరో చెత్తకుప్పలో పడేశారు. స్థానికులు గుర్తించి శిశు సంరక్షణ కేంద్రంలో చేర్చారు. తరచూ లక్నోకు వచ్చివెళ్తున్న అమెరికన్ దంపతులు బాలుడి విషయం తెలుసుకొని దత్తత తీసుకున్నారు. పాస్‌పోర్టు ప్రక్రియ పూర్తవగానే బాలుడిని వారు US తీసుకెళ్లనున్నారు. దత్తత తీసుకున్న వ్యక్తి USలో పెద్ద సంస్థకు CEO అని తెలుస్తోంది.