News October 8, 2024
రాష్ట్రంలో మరో ఘోరం.. బాలికకు మద్యం తాగించి

AP: కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ బాలిక(16)పై అత్యాచారం జరిగిన ఘటన వెలుగు చూసింది. నడుచుకుంటూ వెళ్తున్న బాలికను ఆటోలో వచ్చిన ఒక వ్యక్తి, మరో మహిళ కాగితం చూపించి అడ్రస్ అడిగారు. మత్తు మందు స్ర్పే చేసి పట్టణ శివారుకు తీసుకెళ్లి బాలికకు బలవంతంగా మద్యం తాగించి ఆ వ్యక్తి అత్యాచారం చేశాడు. అపస్మారక స్థితిలోని బాలికను మళ్లీ ఆటో ఎక్కిస్తుండగా చెత్త ఏరుకునే మహిళ చూసి అనుమానించింది. దీంతో వ్యవహారం బయటపడింది.
Similar News
News March 16, 2026
పాక్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. సిరీస్ కైవసం!

పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలిచింది. 290 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 279 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. సల్మాన్ అఘా(106) సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయారు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 4, నహిద్ రాణా 2, ముస్తాఫిజుర్ రహ్మాన్ 3, హొస్సేన్ 1 వికెట్ తీశారు. దీంతో 3 వన్డేల సిరీస్‌ను 2-1తో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది.
News March 16, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 16, 2026
‘ఆపరేషన్ లోటస్’కు BJP తెరలేపింది: DK శివకుమార్

రాజ్యసభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ ఆరోపించారు. ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.5 కోట్ల చొప్పున ఇచ్చేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఇది బీజేపీ ఆపరేషన్ లోటస్‌లో భాగమన్నారు. క్రాస్ ఓటింగ్ చేయాలని నలుగురు వ్యక్తులు తమ ఎమ్మెల్యేలను కాంటాక్ట్ చేశారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.


