News October 4, 2024
హర్షసాయి కేసులో మరో ట్విస్ట్

TG: యూట్యూబర్ హర్షసాయి లైంగిక వేధింపుల కేసులో ఆయన తండ్రి రాధాకృష్ణ, యూట్యూబర్ ఇమ్రాన్ ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కేసులో నిందితులుగా చేర్చకముందే బెయిల్ ఎలా ఇస్తారని పిటిషనర్లను ప్రశ్నించింది. కాగా ఇప్పటికే హర్షసాయితోపాటు రాధాకృష్ణ, ఇమ్రాన్లపై కూడా అత్యాచార బాధితురాలు ఫిర్యాదు చేశారు. హర్షతో తనకు పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చి మోసం చేశారని ఆమె పేర్కొన్నారు.
Similar News
News January 10, 2026
అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. మిసిసిపీలోని క్లే కౌంటీలో దుండగుడు జరిపిన ఫైరింగ్లో ఆరుగురు చనిపోయారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో అతడు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కాల్పులు జరిపింది ఎవరు, ఎందుకు చేశాడనే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 10, 2026
బంగ్లా-పాక్ మధ్య విమానాలు.. కేంద్రం పర్మిషన్ ఇస్తుందా?

పాక్కు ఈ నెల 29 నుంచి బంగ్లాదేశ్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండియన్ ఎయిర్ స్పేస్ నుంచే అవి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో బంగ్లా విమానాలకు కేంద్రం పర్మిషన్ ఇస్తుందా అనేది కీలకంగా మారింది. పాక్ విమానాలు మన గగనతలం నుంచి వెళ్లడంపై నిషేధం ఉంది. ఈ క్రమంలో ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే 2,300KM వెళ్లాల్సిన విమానాలు 5,800KM మేర చుట్టేసుకుని పోవాల్సి ఉంటుంది. 3 గంటల జర్నీ కాస్తా 8 గంటలకు పెరగనుంది.
News January 10, 2026
విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి కలిసిపోతాయి: సీఎం

AP: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీలను అమరావతికి తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాబోయే 6 నెలల్లోనే క్వాంటం కంప్యూటర్ అమరావతి నుంచి పనిచేయటం ప్రారంభిస్తుందన్నారు. కొందరు అమరావతి నిర్మాణ వేగాన్ని చూసి అసూయ చెందుతున్నారని విమర్శించారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి.. అన్నీ కలిసిపోయి ఒక బెస్ట్ లివబుల్ సిటీగా తయారవుతుందని ఓ కాలేజీ వార్షికోత్సవ సభలో వివరించారు.


