News October 4, 2024

హర్షసాయి కేసులో మరో ట్విస్ట్

image

TG: యూట్యూబర్ హర్షసాయి లైంగిక వేధింపుల కేసులో ఆయన తండ్రి రాధాకృష్ణ, యూట్యూబర్ ఇమ్రాన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కేసులో నిందితులుగా చేర్చకముందే బెయిల్ ఎలా ఇస్తారని పిటిషనర్లను ప్రశ్నించింది. కాగా ఇప్పటికే హర్షసాయితోపాటు రాధాకృష్ణ, ఇమ్రాన్‌లపై కూడా అత్యాచార బాధితురాలు ఫిర్యాదు చేశారు. హర్షతో తనకు పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చి మోసం చేశారని ఆమె పేర్కొన్నారు.

Similar News

News November 6, 2024

రిలీజైన నెలరోజుల్లోనే OTTలోకి ‘లక్కీ భాస్కర్’?

image

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రేక్షకులను అలరిస్తూనే మంచి కలెక్షన్లు రాబడుతోంది. అయితే, రిలీజైన నెలరోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 30న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

News November 6, 2024

క్యాబినెట్ భేటీ ప్రారంభం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి బడ్జెట్, నూతన క్రీడా విధానం, డ్రోన్, సెమీ కండక్టర్ పాలసీలు, ప్రభుత్య ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంపుదలపై క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. ఇటు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లపైనా చర్చించనున్నారు.

News November 6, 2024

OFFICIAL: రాముడిగా రణ్‌బీర్.. సీతగా సాయిపల్లవి

image

బాలీవుడ్ ‘రామాయణ’ మూవీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది. 2026 దీపావళికి మొదటి, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానున్నాయి. నితేశ్ తివారీ రూపొందించనున్న ఈ మూవీలో బాబీ డియోల్, యశ్ కీలకపాత్రలు పోషిస్తారు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తారు.