News September 2, 2024

రజినీ ‘కూలీ’ నుంచి మరో అప్డేట్

image

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కూలీ’. తాజాగా చిత్ర యూనిట్ మరో అప్డేట్ ఇచ్చింది. ఇందులో రజినీ పాత్ర పేరును ‘దేవ’గా పేర్కొంది. చేతిలో కూలీ నంబర్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. కాగా ఈ సినిమాలో నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర తదితరుల పాత్రలను ఇప్పటికే రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News September 12, 2024

కోలుకుంటున్న రవితేజ.. LATEST PHOTO

image

హీరో రవితేజకు ఇటీవల షూటింగ్‌లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అభిమానులు ఆందోళనకు లోనవుతుండటంతో చిన్నగాయమేనని రవితేజ అప్‌డేట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ప్రమాదం తర్వాత తొలిసారిగా రవి ఫొటో బయటికొచ్చింది. డైరెక్టర్ బాబీతో భేటీ అనంతరం తీసిన ఆ ఫొటోలో ఆయన చేతికి కట్టుతో కనిపిస్తున్నారు. దీంతో రవితేజ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొనాలంటూ ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.

News September 12, 2024

BRS హయాంలో పీఏసీ పదవి MIMకి ఎందుకిచ్చారు? : రేవంత్

image

TG: BRS నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని CM రేవంత్ మండిపడ్డారు. ఎవరి కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండదన్నారు. ‘BRS హయాంలో పీఏసీ పదవి MIMకి ఎందుకిచ్చారు? ఎవరూ పార్టీ మారకపోతే మాకే మేలు. అసెంబ్లీలో మా బలం 65. BJP, BRS మా ప్రభుత్వాన్ని 3నెలల్లో కూల్చేస్తాం అంటున్నాయి. ఫిరాయింపు చట్టం కఠినంగా ఉంటే ఆ పరిస్థితి రాదు. హైకోర్టు తీర్పుని అధ్యయనం చేయలేదు. దానిపై ఇప్పుడే స్పందించలేను’ అని అన్నారు.

News September 12, 2024

పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి: CBN

image

AP: సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ‘అట్టడుగు వర్గాలతో ఏచూరికి మంచి అనుబంధం ఉంది. పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి. దేశ రాజకీయాల్లో గౌరవస్థానం పొందారు’ అని చంద్రబాబు అన్నారు. ప్రజాపోరాట యోధుడిని కోల్పోయామని మంత్రి లోకేశ్ అన్నారు. ఏచూరికి కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు.