News September 11, 2024
విశాఖకు మరో వందేభారత్

విశాఖ నుంచి ఇప్పటికే మూడు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా SEP 15 నుంచి మరొకటి అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం నుంచి దుర్గ్(ఛత్తీస్‌గఢ్)కు గురువారాలు మినహా ప్రతిరోజు ఈ సర్వీస్ నడుస్తుంది. ఉ.6 గంటలకు దుర్గ్‌లో బయల్దేరి రాయ్‌పూర్, మహాసముంద్, రాయగడ, విజయనగరం మీదుగా మ.1.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మ.2.55 గం.కు బయల్దేరి రా.10.50 గం.కు దుర్గ్ చేరుకుంటుంది.
Similar News
News February 1, 2026
ట్యాక్స్ శ్లాబ్‌లలో మార్పు లేదు.. పాతవే కంటిన్యూ!

బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి మార్పులు లేవు. పాత శ్లాబ్‌లనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పన్ను విధానం కింద గతంలో ఉన్నట్లే స్టాండర్డ్ డిడక్షన్ ₹75,000తో కలిపి ₹12.75 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను సున్నా. ఆ పరిమితి దాటితే ₹4 లక్షల వరకు-0%, ₹4-8 లక్షలు-5%, ₹8-12 లక్షలు-10%, ₹12-16 లక్షలు-15%, ₹16-20లక్షలు-20%, ₹20-24 లక్షలు-25%, ₹24 లక్షల పైన-30% పన్ను కట్టాలి.
News February 1, 2026
TTD EO సింఘాల్ బదిలీ..రవిచంద్రకు బాధ్యతలు

AP: TTD EO అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో CM ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సరిగా వ్యవహరించలేదని, చర్యలు చేపట్టాలని CBI SIT నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. తక్షణమే అదనపు EO వెంకయ్య చౌదరికి బాధ్యతలు అప్పగించాలని, జీఏడీలో రిపోర్టు చేయాలని సింఘాల్‌ను ఆదేశించింది.
News February 1, 2026
పన్నుల వాటా: APకి ₹64362 కోట్లు, TGకి ₹33180 కోట్లు

FY26-27కి యూనియన్ ట్యాక్స్‌లు, డ్యూటీ నికర ఆదాయాల నుంచి రాష్ట్రాల వారీగా పంపిణీ అయ్యే నిధులను కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. ఏపీకి ₹64362 CR, ₹33180 CR అందనున్నాయి. గతేడాదిలో APకి ₹56373 CR, TGకి ₹29280 CR రివైజ్డ్ కేటాయింపుల్లో చూపింది. కాగా యూపీకి ₹268910 CR బిహార్‌కు ₹151831 CR, మధ్యప్రదేశ్‌కు ₹112133CR మహారాష్ట్ర కు ₹98306CR రాజస్థాన్‌కు ₹90445CR కేటాయించింది.


