News September 11, 2024

విశాఖకు మరో వందేభారత్

image

విశాఖ నుంచి ఇప్పటికే మూడు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా SEP 15 నుంచి మరొకటి అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం నుంచి దుర్గ్(ఛత్తీస్‌గఢ్)కు గురువారాలు మినహా ప్రతిరోజు ఈ సర్వీస్ నడుస్తుంది. ఉ.6 గంటలకు దుర్గ్‌లో బయల్దేరి రాయ్‌పూర్, మహాసముంద్, రాయగడ, విజయనగరం మీదుగా మ.1.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మ.2.55 గం.కు బయల్దేరి రా.10.50 గం.కు దుర్గ్ చేరుకుంటుంది.

Similar News

News November 17, 2025

గిగ్ వర్కర్ల బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

image

TG: గిగ్, ప్లాట్‌ఫామ్ ఆధారిత వర్కర్లకు సామాజిక భద్రత, భరోసా కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ప్యాకేజీ డెలివరీల్లో పనిచేస్తున్న 4 లక్షల మంది ప్రయోజనం పొందే అవకాశం ఉంది. గిగ్ వర్కర్లు వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి వివేక్ సూచించారు. త్వరలో అసెంబ్లీలో గిగ్ వర్కర్ల బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు.

పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు: పొంగులేటి

image

TG: కాంగ్రెస్ పార్టీ పరంగా BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. తొలుత సర్పంచ్ ఎలక్షన్లు DECలనే నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చితో రూ.3వేల కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉండటంతో సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు పేర్కొన్నారు. HC తీర్పు అనంతరం MPTC, ZPTC ఎన్నికలకు వెళ్తామన్నారు.