News March 13, 2025
వాయుసేన అమ్ములపొదిలోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ(ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్ యుద్ధవిమానం(LCA) AF MK1 నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు DRDO ప్రకటించింది. 100 కి.మీ పరిధిలో పైలట్ కంటికి కనిపించని లక్ష్యాలను కూడా ఈ క్షిపణి సాయంతో ఛేదించవచ్చు.
Similar News
News January 6, 2026
కుజ దోష నివారణకు శుభప్రదం ‘మంగళ వారం’

జాతకంలో కుజ దోషంతో సమస్యలు ఎదుర్కొనే వారు మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేయడం విశేష ఫలితాలుంటాయి. కుజుడికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని, హనుమంతుడిని ఆరాధిస్తే దోష తీవ్రత తగ్గుతుంది. ఎరుపు దుస్తులు ధరించి పూజ చేయాలి. కందులు దానం చేయడం, కుజ అష్టోత్తరం పఠించడం వల్ల జాతకంలోని ప్రతికూలతలు తొలగి సుఖశాంతులు చేకూరుతాయి. భక్తితో చేసే ఈ పరిహారాలు మానసిక ధైర్యాన్ని ఇచ్చి కార్యసిద్ధికి మార్గం చూపుతాయి.
News January 6, 2026
ఇంటర్వ్యూతో ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

ఏపీ: మంగళగిరిలోని <
News January 6, 2026
రష్యా నుంచి మాకు ఆయిల్ రావడం లేదు: రిలయన్స్

రష్యా నుంచి తమ జామ్నగర్ రిఫైనరీకి ముడి చమురు నౌకలు వస్తున్నాయన్న వార్తలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఖండించింది. వాటిల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. గత 3 వారాలుగా తాము రష్యన్ ఆయిల్ కార్గోను స్వీకరించలేదని, జనవరిలో కూడా అక్కడి నుంచి చమురు వచ్చే అవకాశం లేదని వెల్లడించింది. తాము ముందే క్లారిటీ ఇచ్చినప్పటికీ తప్పుడు కథనాలను పబ్లిష్ చేయడం వల్ల తమ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేసింది.


