News March 13, 2025

వాయుసేన అమ్ములపొదిలోకి మరో ‘అస్త్రం’

image

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజన్సీ(ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్ యుద్ధవిమానం(LCA) AF MK1 నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు DRDO ప్రకటించింది. 100 కి.మీ పరిధిలో పైలట్ కంటికి కనిపించని లక్ష్యాలను కూడా ఈ క్షిపణి సాయంతో ఛేదించవచ్చు.

Similar News

News March 22, 2025

అల్లు అర్జున్‌ రెమ్యునరేషన్ రూ.175 కోట్లు?

image

‘పుష్ప-2’ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశంలోనే హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా దూసుకెళుతున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీతో తీసే మూవీకి బన్నీ రూ.175 కోట్లు తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. దీంతోపాటు లాభాల్లో 15% వాటా ఇచ్చేలా ‘సన్ పిక్చర్’తో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా అక్టోబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు టాక్.

News March 22, 2025

BREAKING: 357 బెట్టింగ్ సైట్స్ బ్లాక్

image

పన్ను ఎగ్గొడుతున్న ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌లపై కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన DGGI కొరడా ఝుళిపించింది. 357 వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది. ఆయా సంస్థలకు చెందిన 2,400 అకౌంట్లలోని రూ.126 కోట్లను సీజ్ చేసింది. దాదాపు 700 విదేశీ సంస్థలు ఆన్‌లైన్ గేమింగ్/బెట్టింగ్/గ్యాంబ్లింగ్ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News March 22, 2025

కేకేఆర్ టీమ్‌కు షారుఖ్ ఖాన్ సందేశం

image

ఈరోజు తొలిమ్యాచ్ ఆడనున్న డిఫెండింగ్ ఛాంపియన్స్ KKRకు ఆ జట్టు యజమాని షారుఖ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ‘మీ అందరిపై దేవుడి కరుణ ఉండాలి. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని చక్కగా చూసుకుంటున్న చంద్రకాంత్ గారికి థాంక్స్. కొత్తగా జట్టులో చేరిన వారికి వెల్‌కమ్. ఈ సీజన్‌లో మనల్ని నడిపించనున్న అజింక్యకు ధన్యవాదాలు. మీ అందరికీ ఈ టీమ్ ఇల్లులా మారుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.

error: Content is protected !!