News July 13, 2024
స్కూళ్లలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రహరీ క్లబ్‌లు

TG: డ్రగ్స్ కల్చర్ నిర్మూలనకు హైస్కూళ్లలో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్లు, పేరెంట్స్, పోలీసులు, 6-10 తరగతుల విద్యార్థులకు ఈ క్లబ్‌లలో చోటు కల్పిస్తారు. త్వరలో విధివిధానాలు ఖరారు కానున్నాయి. డ్రగ్స్ కట్టడికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది.
Similar News
News March 26, 2026
ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ లాంచ్?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 25న అధికారికంగా పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా, గుర్తుగా ‘ధర్మగంట’ను ఎంచుకున్నట్లు టాక్. రేపు నిజామాబాద్‌లో జరిగే సమావేశంలో దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులో OBC మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.
News March 26, 2026
2 రోజుల్లో రూ.15.80 లక్షల కోట్ల లాభం

యుద్ధ మేఘాలు తొలగిపోతున్నాయన్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం రికార్డు స్థాయిలో రాణించాయి. కేవలం 2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.15.80 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం సెన్సెక్స్ 1,205 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు ఎగబాకాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు దీనికి ప్రధాన కారణం. శ్రీరామ నవమి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు.
News March 26, 2026
గ్యాస్ సంక్షోభం.. భారత్‌ను ఆదుకుంటున్న అర్జెంటీనా

పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో ఏర్పడిన LPG కొరతను తీర్చడానికి అర్జెంటీనా ముందుకొచ్చింది. 2026 మొదటి 3 నెలల్లోనే దాదాపు 50,000 టన్నుల గ్యాస్‌ను భారత్‌కు పంపింది. ఇది గతేడాది మొత్తం ఎగుమతుల కంటే రెండింతలు ఎక్కువ. సుమారు 20,000 కిలోమీటర్ల సుదూర ప్రయాణం, రవాణా ఖర్చులు భారమైనప్పటికీ భారత్ ఇంధన అవసరాల కోసం అర్జెంటీనా తన సహకారాన్ని పెంచింది.


