News July 13, 2024

స్కూళ్లలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రహరీ క్లబ్‌లు

image

TG: డ్రగ్స్ కల్చర్‌ నిర్మూలనకు హైస్కూళ్లలో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్లు, పేరెంట్స్, పోలీసులు, 6-10 తరగతుల విద్యార్థులకు ఈ క్లబ్‌లలో చోటు కల్పిస్తారు. త్వరలో విధివిధానాలు ఖరారు కానున్నాయి. డ్రగ్స్ కట్టడికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది.

Similar News

News December 7, 2024

వచ్చే వారం టీడీపీలో చేరుతా: వాసిరెడ్డి పద్మ

image

AP: తాను వచ్చే వారం TDPలో చేరనున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ఇవాళ ఎంపీ కేశినేని చిన్నితో ఆమె భేటీ అయ్యారు. ఆమె ఇప్పటికే YCPకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైతం TDP కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈనెల 9న ఆయన ఆ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన చేరికను పలువురు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.

News December 7, 2024

రష్మికకు కలిసొచ్చిన ‘డిసెంబర్’

image

ఈ నెల 5న విడుదలైన ‘పుష్ప-2’లో రష్మిక నటన, డాన్స్‌తో అదరగొట్టారని అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ వసూళ్లు రాబడుతున్న ఈ మూవీ రష్మికకు మంచి హిట్ ఇచ్చింది. గత ఏడాది ‘యానిమల్’ మూవీ కూడా ఇదే నెలలో విడుదలై రూ.900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇందులో గీతాంజలి పాత్రలో ఈ బ్యూటీకి మంచి మార్కులు పడ్డాయి. దీంతో రష్మికకు డిసెంబర్ మాసం కలిసొచ్చిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

News December 7, 2024

ఎంవీఏ నుంచి తప్పుకొన్న సమాజ్‌వాదీ పార్టీ

image

మహావికాస్ అఘాడీ(MVA) నుంచి తప్పుకొంటున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ (SP) ప్రకటించింది. ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు మిలింద్ నర్వేకర్ బాబ్రీ మసీదు కూల్చివేతను సమర్థించేలా ట్వీట్ చేయడమే దీనిక్కారణమని మహారాష్ట్ర SP అధ్యక్షుడు అబు అసీం అజ్మీ తెలిపారు. శివసేన(UBT) సైతం బాబ్రీ కూల్చివేతకు మద్దతిచ్చేలా పేపర్‌లో ప్రకటన ఇచ్చిందని గుర్తుచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు.