News March 3, 2025

ఆస్కార్ అవార్డుల్లో ‘అనుజా’కు నిరాశ

image

ఆస్కార్-2025 బరిలో నిలిచిన ఏకైక ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ‘అనుజా’కు నిరాశ ఎదురైంది. 22 నిమిషాల డచ్ మూవీ ‘ఐయామ్ నాట్ రోబోట్’కు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డు దక్కింది. ఢిల్లీలోని గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఇద్దరు బాలికల జీవిత కథ ఆధారంగా ‘అనుజా’ను ఆడమ్ జే గ్రేవ్స్ తెరకెక్కించారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం.

Similar News

News March 21, 2025

దుస్తులు మార్చుకుంటుండగా డోర్ తీశాడు: షాలినీ పాండే

image

ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఓ దక్షిణాది సినిమాలో నటిస్తున్న సమయంలో నా అనుమతి లేకుండానే ఓ డైరెక్టర్ నా క్యారవాన్‌ డోర్ తీశాడు. అప్పుడు నేను బట్టలు మార్చుకుంటున్నా. అతడిపై నేను గట్టిగా కేకలు వేయడంతో వెళ్లిపోయారు. డైరెక్టర్ తీరుతో నేను ఎంతో బాధపడ్డా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా షాలినీ పలు సినిమాల్లో నటించారు.

News March 21, 2025

తాడిపత్రిలో ఉద్రిక్తత

image

AP: అనంతపురం(D) తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. YCP నేత ఫయాజ్ బాషా ఇల్లు అక్రమ నిర్మాణమనే ఆరోపణతో మున్సిపల్ అధికారులు జేసీబీతో తరలివచ్చారు. దానివెంట టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వందలాది మంది అనుచరులతో వచ్చారు. ఈ క్రమంలో ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. వైసీపీ శ్రేణులూ భారీగా వచ్చి ఎదురుదాడి చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

News March 21, 2025

BRS వల్ల ఒక జనరేషన్‌ నాశనం: భట్టి

image

TG: రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక జనరేషన్ యువతను BRS నాశనం చేసిందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్లపాటు ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో వారు నష్టపోయారని అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ పెట్టినా పూర్తి నిధులను ఎప్పుడూ ఖర్చు చేయలేదు. దొడ్డిదారిన ఓఆర్ఆర్, ప్రభుత్వ భూములను అమ్ముకుంది. తర్వాత ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా ముందే లాక్కుంది’ అని ఫైర్ అయ్యారు.

error: Content is protected !!