News April 16, 2024
వారెవ్వా.. ఇది పైసా వసూల్ మ్యాచ్
హోరాహోరీ క్రికెట్ మ్యాచ్ ఇచ్చే కిక్కే వేరు. SRHvsRCB మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్లతో ఇరుజట్ల ప్లేయర్లు తగ్గేదేలే అన్నట్లు విరుచుకుపడ్డారు. దీంతో ఫ్యాన్స్ పైసా వసూల్ పర్ఫార్మెన్‌ను ఎంజాయ్ చేశారు. SRHలో హెడ్(102), క్లాసెన్(67), సమద్(37), అభిషేక్(34), మార్క్రమ్(32) బ్యాటుతో సత్తా చాటగా.. కమిన్స్(3), మార్కండే(2) బంతితో రాణించారు. RCBలో DK(83), డుప్లెసిస్(62), కోహ్లీ(42) దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు.
Similar News
News November 17, 2024
‘చెప్పులు’ నిషేధించాలని స్వతంత్ర అభ్యర్థి విజ్ఞప్తి.. ఎందుకంటే?
MHలో పరాందా నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి పోలింగ్ బూత్‌ల వద్ద చెప్పులు నిషేధించాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. తనకు EC చెప్పుల గుర్తు కేటాయించడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ప్రకారం అభ్యర్థుల గుర్తు పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రదర్శించడం నిషేధమని, అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను నిలబెట్టేందుకు ఈ రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
News November 17, 2024
గాలిని కూడా అమ్మేస్తున్నారు!
ఇప్పటికే నీటిని కొనుక్కుని తాగుతున్నాం. కాలుష్య స్థాయులు చూస్తుంటే మున్ముందు గాలిని కూడా కొనుక్కోక తప్పేలా లేదు. దీన్ని అంచనా వేసిన కమ్యూనికా అనే సంస్థ గాలిని అమ్మేస్తోంది. ఇటలీలోని లేక్ కోమో సరస్సును ఆనుకుని ఉండే గ్రామంలో స్వచ్ఛమైన గాలిని తమ సీక్రెట్ ఫార్ములా ఎయిర్‌తో కలిపి 400 మి.లీ టిన్‌లలో రూ.907కి విక్రయిస్తోంది. ఆ గాలి పీల్చినవారి మనసు తేలికవుతుందని చెబుతోంది.
News November 17, 2024
తిరుమలలో అన్యమత ప్రచారం వదంతులు
తిరుమలలో ఓ వర్గం వారు అన్యమత ప్రచారం చేశారనే వదంతులు భక్తుల్లో కలకలం రేపుతున్నాయి. పాప వినాశనం దగ్గర అన్య మతస్తులు రీల్స్ చేశారనే ప్రచారం జోరుగా సాగడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. నిజంగా అన్యమత ప్రచారం చేశారా? ఇది తిరుమలలోనే జరిగిందా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.