News November 17, 2024

వృద్ధులు, వికలాంగులకే ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు’!

image

AP: ప్రజలు ఎక్కడి నుంచైనా తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తీసుకొచ్చిన ‘ఎనీవేర్’ విధానంపై ప్రభుత్వం సమీక్షిస్తోంది. దీనిలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఈ విధానాన్ని 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఇందుకోసం మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ మేరకు అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు ఆమోదిస్తే వెంటనే అమల్లోకి రానున్నాయి.

Similar News

News December 6, 2024

ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త చీఫ్ ఎవరంటే..

image

ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) కొత్త అధ్యక్షుడిగా శ్రీలంక క్రికెట్(SLC) బోర్డు ప్రెసిడెంట్ షమ్మీ సిల్వా నియమితులయ్యారు. 3 పర్యాయాలు ఏసీసీ చీఫ్‌గా పని చేసిన జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సిల్వాకు ఛాన్స్ దక్కింది. గతంలో ఏసీసీ ఫైనాన్స్-మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పనిచేశారు.

News December 6, 2024

8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్

image

8వ వేత‌న సంఘం ఏర్పాటుపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌తిపాద‌న త‌మ ప‌రిశీల‌న‌లో లేద‌ని కేంద్ర ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది. 7వ వేత‌న సంఘం కాల‌ప‌రిమితి త్వ‌ర‌లో ముగుస్తున్నందున కొత్త ఏడాదిలో కొత్త పే క‌మిష‌న్‌పై కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గంపెడాశ‌లు పెట్టుకున్నారు. అయితే కొత్త కమిషన్ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం తమ వద్ద లేదని కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరీ ఇటీవ‌ల‌ రాజ్య‌స‌భ‌లో తెలిపారు.

News December 6, 2024

BGT: తొలిరోజు ఆసీస్‌దే

image

భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ తొలిరోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 180 రన్స్‌కు ఆలౌట్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. ఆట ముగిసే సమయానికి 86/1 రన్స్ చేసింది. క్రీజులో మెక్‌స్వీని 38, లబుషేన్ 20 ఉన్నారు. ఆసీస్ వికెట్ల కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు.