News December 13, 2024

టూరిస్ట్ డెస్టినేషన్‌గా ఏపీ: పవన్ కళ్యాణ్

image

AP: రాష్ట్రాన్ని టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారుస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు లాంటి మహోన్నత వ్యక్తి సారథ్యంలో రాష్ట్రం దూసుకెళ్తుంది. గోవా వంటి ఫేమస్ టూరిస్ట్ స్పాట్‌లు నాశనమయ్యాయి. మన రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు

Similar News

News November 23, 2025

జాతీయ వేదికపై కోనసీమ మెరుపులు

image

భోపాల్‌లో జరిగిన 52వ జాతీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రాజెక్టు సత్తా చాటింది. ఇక్కడి నుంచి ఎంపికైన ‘ఈజీ మెషిన్ టూల్’ అత్యంత ప్రజాదరణ పొంది ‘బెస్ట్ పబ్లిక్ రెస్పాన్స్’ అవార్డును కైవసం చేసుకుంది. జిల్లాకు వరుసగా తొమ్మిదోసారి జాతీయ అవార్డు దక్కడం గర్వకారణమని జిల్లా సైన్స్ అధికారి సుబ్రహ్మణ్యం ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను డీఈవో సలీం బాషా ప్రత్యేకంగా అభినందించారు.

News November 23, 2025

భూమిలో కర్బన నిల్వల స్థాయి టెస్టింగ్ ఇలా..

image

ఒక చెంచాతో 1 గ్రాము మట్టిని, 2ml పొటాషియం డైక్రోమేట్‌తో పాటు 2ml సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఒక సీసాలో పోసి బాగా కలపాలి. 20 నిమిషాల తర్వాత ఆ సీసాలో నీటిని పోయాలి. ఆ ద్రావణం మారిన రంగును బట్టి భూమిలో కర్బన శాతం తెలుసుకోవచ్చు. ☛ నారింజ/పసుపు రంగు – కర్బన స్థాయి తక్కువ ☛ ముదురు గోధుమ/ నలుపు రంగు – కర్బన స్థాయి మధ్యస్థం ☛ ఆకు పచ్చ/ నీలి రంగు – కర్బన స్థాయి ఎక్కువ.

News November 23, 2025

2 రోజుల్లోనే ముగిసిన టెస్టు.. రూ.17.35 కోట్ల నష్టం!

image

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు కేవలం 2 రోజుల్లో ముగియడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియాకు భారీ నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. మూడు, నాలుగో రోజులకు అమ్మకానికి ఉంచిన టికెట్‌ ఆదాయం కోల్పోవడంతో దాదాపు రూ.17.35 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. మూడో రోజు టికెట్లు దాదాపు అమ్ముడుపోయినట్లు సమాచారం. మొదటి రెండు రోజుల్లోనే లక్షకుపైగా అభిమానులు హాజరైనా, తర్వాతి రోజుల ఆదాయం కోల్పోవడం గట్టిదెబ్బే.