News June 17, 2024

24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

image

AP: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 19 నుంచే అసెంబ్లీ ప్రారంభం కావాల్సి ఉండగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సెలవులో ఉండటంతో మార్పు చేశారు. 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత నూతన శాసనసభ్యుల ప్రమాణస్వీకారం జరగనుంది.

Similar News

News September 14, 2025

రూ.153 కోట్లతో USలో ఇల్లు కొన్న అంబానీ

image

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అమెరికాలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది. న్యూయార్క్‌లోని ఈ ఇంటి విలువ $17.4 మిలియన్లు (రూ.153 కోట్లు) అని పేర్కొంది. గత పదేళ్లుగా అది ఖాళీగా ఉందని తెలిపింది. 2018లో రాబర్ట్ పేరా $20 మిలియన్లకు దీన్ని కొనుగోలు చేశారు. 20వేల స్క్వేర్ ఫీట్ల ఈ భారీ భవంతిలో 7 బెడ్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్, 5వేల స్క్వేర్ ఫీట్ల ఔట్ డోర్ స్పేస్ ఉన్నాయి.

News September 14, 2025

పాకిస్థాన్ బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

image

ఆసియాకప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్: అభిషేక్, గిల్, సూర్య కుమార్(C), తిలక్ వర్మ, శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, అక్షర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాక్: ఫర్హాన్, అయుబ్, హారిస్, జమాన్, సల్మాన్(C), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, అష్రఫ్, షాహిన్ అఫ్రిదీ, ముఖీం, అహ్మద్

*SonyLIVలో లైవ్ మ్యాచ్ చూడొచ్చు.

News September 14, 2025

అద్భుతం.. జైపూర్ ఫుట్ తరహాలో ‘వైజాగ్ హ్యాండ్’

image

వైజాగ్‌లోని ఏపీ మెడిటెక్ జోన్ దివ్యాంగుల కోసం కృత్రిమ చేయిని అభివృద్ధి చేసింది. ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన వారికి ఉపయోగపడేలా ‘వైజాగ్ హ్యాండ్’ పేరుతో దీనిని రూపొందించింది. ఇటీవల ఓ మహిళకు అమర్చగా ఆమె స్వయంగా పనులు చేసుకున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. జైపూర్ ఫుట్ తరహాలో చేతులు కోల్పోయిన వారికి ఇది సహకరిస్తుందని పేర్కొన్నారు. సోలార్ పవర్‌తో నడిచే వీల్‌చైర్లను కూడా తయారు చేస్తున్నామని చెప్పారు.