News July 22, 2024
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరగనుంది. సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. ఈనెల 26 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 8, 2025
వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు

RBI <<18475069>>రెపో రేటును<<>> 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25% తగ్గించాయి. రెపో అనుసంధానిత రుణ రేటును PNB 8.35 నుంచి 8.10%కి, BOB 8.15 నుంచి 7.90%కి, BOI 8.35 నుంచి 8.10%కి సవరించాయి. హోం లోన్ రేట్లు 7.10%, కార్ లోన్ రేట్లు 7.45% నుంచి ప్రారంభమవుతాయని BOM తెలిపింది.
News December 8, 2025
ముడతలు తగ్గించే ఫేస్ ప్యాక్

యవ్వనంగా కనిపించే చర్మం కోసం రసాయన ఉత్పత్తులకు బదులు ఇంట్లోని సహజ పదార్థాలను వాడితే చాలు. వాటిల్లో ఒకటే ఈ అరటిపండు ఫేస్ ప్యాక్. బాగా మగ్గిన అరటిపండును తీసుకొని కాస్త తేనె, బార్లీ పౌడర్ కలిపి పేస్ట్ చేయాలి. బార్లీకి బదులు బియ్యప్పిండి కూడా వాడొచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి అరగంట ఉంచిన తర్వాత కడిగేయాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేస్తే చర్మం యవ్వనంగా మారుతుంది.
News December 8, 2025
శివలింగానికి అభిషేకం చేస్తున్నారా?

శివుడు అభిషేక ప్రియుడు. అయనను నీటితో అభిషేకించినా అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు. అయితే ఉత్తర/తూర్పు దిశలో నిలబడి రాగి/కంచు పాత్రతో శివాభిషేకం చేయడం అత్యంత శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. అభిషేక సమయంలో ‘‘ఓం నమః శివాయ’’ అనే పంచాక్షరీ మంత్రం లేదా ‘‘ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నో రుద్ర ప్రచోదయాత్’’ అనే గాయత్రీ మంత్రాన్ని పఠించాలని సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


