News November 11, 2024

22 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

image

AP: ఈ నెల 22వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. బిల్లులకు, చర్చలకు అనుగుణంగా శనివారం కూడా సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులు 2పూటలా సభ జరగనుంది. మరోవైపు, ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చ జరిపేందుకు MLAలు విధిగా అసెంబ్లీకి రావాలన్నారు. చీఫ్ విప్, విప్‌లను రేపు ఖరారు చేస్తామని సీఎం వెల్లడించారు.

Similar News

News January 22, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్‌కు 160 CRPC కింద నోటీసులు జారీ చేసింది. నందినగర్‌లోని ఆయన ఇంటికి నోటీసులు పంపింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. కాగా రెండు రోజుల క్రితమే మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ 7 గంటల పాటు విచారించింది.

News January 22, 2026

RITES లిమిటెడ్ 48 పోస్టులకు నోటిఫికేషన్

image

<>RITES<<>> లిమిటెడ్ 48 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ/ బీటెక్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. FEB 23, 24తేదీల్లో హరియాణాలో, ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో తిరువనంతపురంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://rites.com

News January 22, 2026

సీఎం రేవంత్‌తో మంత్రి లోకేశ్ భేటీ

image

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌ను శాలువాతో సత్కరించారు. ఇరు రాష్ట్రాల్లోని విద్యా సంస్కరణలు, ఐటీ అభివృద్ధి, స్కిల్ డెలవప్‌మెంట్‌పై తామిద్దరం చర్చించినట్లు లోకేశ్ తెలిపారు. కాగా దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునూ సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది.