News November 22, 2024
నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈనెల 11న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ‘రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం సాగించిన విధ్వంసం, కూటమి ప్రభుత్వంలో రాజధాని పునర్నిర్మాణానికి చేపడుతున్న చర్యలు’ అనే అంశంపై నేడు సభలో చర్చ జరగనుంది. అనంతరం 2047-విజన్ డాక్యుమెంట్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన రిలీజ్ చేయనున్నారు. వరదలు, రుషికొండ ప్యాలెస్ తదితర అంశాలపైనా చర్చిస్తారని సమాచారం.
Similar News
News November 22, 2024
హైకోర్ట్ బెంచ్, సింగిల్ బెంచ్ అంటే తెలుసా?
హైకోర్ట్ బెంచ్ అంటే హైకోర్టు మరొక ప్రాంతంలో ఏర్పాటు చేసిన విభాగం/శాఖ. హైకోర్టులో ఒక కేసును ఒక న్యాయమూర్తి విచారిస్తే దాన్ని సింగిల్ బెంచ్ అంటారు. ఇద్దరు జడ్జీలు విచారిస్తే డివిజన్ బెంచ్ అంటారు. ఒకవేళ ముగ్గురు న్యాయమూర్తులు విచారిస్తే దాన్ని ఫుల్ బెంచ్ అంటారు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులుంటే దాన్ని రాజ్యాంగ ధర్మాసనం అంటారు. > SHARE
News November 22, 2024
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 10 మంది మావోలు మరణించారు. ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయని బస్తర్ IG సుందర్ రాజ్ తెలిపారు.
News November 22, 2024
తేనెకు అందుకే ఎక్స్‌పైరీ ఉండదు!
ఏ వస్తువుకైనా ఎక్స్‌పైరీ తేదీని చూసేవారు తేనెకు చూడరు. ఎందుకంటే అది పాడవదు. స్వచ్ఛమైన తేనె దశాబ్దాలైనా పాడవదని పెద్దలు చెప్తుంటారు. ఎందుకో ఆలోచించారా? ‘తేనెలో ఉండే 17శాతం నీరు దీనిని చెడిపోకుండా చేస్తుంది. తక్కువ నీటి శాతం బ్యాక్టీరియాను నిర్జలీకరణం చేస్తుంది. దీంతో చెడిపోదు. ఆమ్లత్వం కూడా 3.9శాతం ఉండటం మరో కారణం. తేమను పీల్చుకునే సామర్థ్యం తేనెకు ఉండటం కూడా ఓ కారణమే’ అని నిపుణులు చెబుతున్నారు.