News November 22, 2024
నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈనెల 11న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ‘రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం సాగించిన విధ్వంసం, కూటమి ప్రభుత్వంలో రాజధాని పునర్నిర్మాణానికి చేపడుతున్న చర్యలు’ అనే అంశంపై నేడు సభలో చర్చ జరగనుంది. అనంతరం 2047-విజన్ డాక్యుమెంట్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన రిలీజ్ చేయనున్నారు. వరదలు, రుషికొండ ప్యాలెస్ తదితర అంశాలపైనా చర్చిస్తారని సమాచారం.
Similar News
News December 11, 2024
‘ప్రజావాణి’ కొనసాగుతుంది: భట్టి విక్రమార్క
TG: ఎన్ని ఇబ్బందులొచ్చినా ‘ప్రజావాణి’ కొనసాగుతుందని dy.CM భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సమస్యలతో వస్తున్న వారందరికీ పరిష్కారం చూపుతున్నామన్నారు. దరఖాస్తులన్నీ పరిశీలిస్తున్నామని, ప్రతి ఒక్కరి బాధను వింటూ పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చి, వారికి జవాబుదారీతనంగా ఉండటమే తమ లక్ష్యమని వివరించారు. ‘మీ కోసం మేము ఉన్నాం’ అనే భావనను అధికారులు ప్రజలకు కల్పించాలని ఆదేశించారు.
News December 11, 2024
మైనార్టీలపై దాడులు.. బంగ్లాదేశ్ కీలక ప్రకటన
బంగ్లాలో హిందువులు, మైనార్టీలపై దాడుల నేపథ్యంలో ఆ దేశం కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 5 నుంచి అక్టోబర్ 22 వరకు 88 మతపరమైన హింసాత్మక దాడులు జరిగినట్లు వెల్లడించింది. 70మందిని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత జరిగిన దాడులపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామంది. ఇటీవల భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లా తాత్కాలిక సారథి యూనస్‌ను కలిసిన నేపథ్యంలో వివరాలు వెల్లడించారు.
News December 11, 2024
ఇది మరో ‘పూనమ్ పాండే స్టంట్’!
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్‌పై 2024 బడ్జెట్లో కేంద్రం ప్రకటన చేసింది. అనంతరం ఈ వ్యాధితో నటి పూనమ్ పాండే మృతి చెందినట్టు ఆమె టీం ప్రకటించడం సంచలనమైంది. అయితే అదో స్టంట్‌గా తేలింది. అలాగే సంస్థలో ఉద్యోగుల ఒత్తిడిపై అవగాహన కల్పించడానికే ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేశామని <<14840427>>Yes Madam<<>> ప్రకటించింది. ఇది మరో ‘పూనమ్ పాండే స్టంట్’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.