News August 5, 2024
ప్రధాని మోదీని కలిసిన AP BJP చీఫ్

AP BJP చీఫ్ పురందీశ్వరి ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్లు ఆమె ట్విటర్లో తెలిపారు. స్టీల్ ప్లాంట్, ఇతర సమస్యలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయనకు వివరించామన్నారు. గత ప్రభుత్వాల దుష్పరిపాలన వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో కూడా చెప్పామన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మద్దతు ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపామని ఆమె పేర్కొన్నారు.
Similar News
News March 15, 2026
నన్ను డ్రగ్స్ కేసులోకి లాగితే లీగల్ యాక్షన్ తప్పదు: KTR

TG: ప్రతీ డ్రగ్స్ కేసులోకి తనని లాగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని KTR హెచ్చరించారు. ఎలాంటి టెస్ట్కైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన ప్రతీసారి BRS పార్టీని లాగడం దారుణమన్నారు. తాను, తమ పార్టీ డ్రగ్స్ వాడకానికి పూర్తి వ్యతిరేకమన్నారు. BRS Ex MLA పైలట్ <<19386182>>రోహిత్ రెడ్డి<<>> డ్రగ్స్ కేసులో చిక్కుకున్న నేపథ్యంలో KTR వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
News March 15, 2026
LPG కంటే PNG బెటర్ అంటున్న నిపుణులు!

దేశ ప్రజలు ఎల్పీజీ కాకుండా PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్)వైపు మళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. మన దేశానికి దిగుమతి అయ్యే LPGలో 90% హార్ముజ్ నుంచే వస్తోంది. ఇప్పుడది క్లోజ్ కావడంతో ఇబ్బందులు వస్తున్నాయి. అయితే LPGతో పోలిస్తే PNGకి డిమాండ్ తక్కువగా ఉంది. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి కొరత వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
News March 15, 2026
‘ఉగాది’ పండుగ ఎప్పుడు?

అమావాస్య గడియలు ఉండటంతో తెలుగు కొత్త సంవత్సరాది ‘ఉగాది’ ఎప్పుడు జరుపుకోవాలనే అయోమయం కొందరిలో నెలకొంది. అయితే చైత్ర శుక్ల పాడ్యమి రోజైన ఈ నెల 19(గురువారం)నే ఉగాది జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 19న ఉదయం 6.52 గంటలకు ‘పరాభవ నామ సంవత్సరం’ మొదలవుతుందని పేర్కొంటున్నారు. అదేరోజు ఇంట్లో షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారుచేసి స్వీకరించాలని సూచిస్తున్నారు.


