News November 9, 2024

ఈనెల 11న ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: ఈనెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అదే రోజున ఉ.9 గంటలకు భేటీ కానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. క్యాబినెట్ ఆమోదించిన అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.

Similar News

News December 7, 2024

కాంబ్లీకి ‘1983 వరల్డ్‌కప్ టీమ్’ అండగా నిలుస్తుంది: గవాస్కర్

image

ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి ‘1983 వరల్డ్ కప్’ జట్టు సభ్యులు అండగా నిలిచేందుకు సిద్ధమని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తెలిపారు. ‘మా కొడుకులు, మనవళ్ల వయసున్న అనేకమంది క్రికెటర్లలో ఇబ్బందులు పడేవారిని చూస్తే చాలా బాధ కలుగుతుంటుంది. అలాంటి వాళ్లను ఆదుకుంటాం. సాయం అనే మాట వాడను కానీ కాంబ్లీకి అండగా ఉంటాం. ఏం చేయాలో చూస్తాం’ అని స్పష్టం చేశారు.

News December 7, 2024

గ్రూప్-2 అభ్యర్థులకు ALERT

image

గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఈ నెల 9 నుంచి వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని TGPSC ఓ ప్రకటనలో తెలిపింది. 1,368 సెంటర్లలో ఈ నెల 15, 16వ తేదీల్లో రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9.30 గంటలు, మ.2.30 గంటలలోపే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. మొత్తం 783 పోస్టులకుగానూ 5.57 లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు.

News December 7, 2024

బిలియనీర్లకు రాయితీలు.. సామాన్యులకు పన్ను పోట్లు: రాహుల్ ఫైర్

image

బిలియనీర్లకు రాయితీలు ఇస్తున్న కేంద్రం, సామాన్యులకు ఆదాయ ప‌న్ను, ఇత‌ర‌త్రా ప‌న్నుల రేట్లు పెంచుతూ అన్యాయం చేస్తోందని రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌పై భారం మోపేలా మోదీ ప్ర‌భుత్వం కొత్త జీఎస్టీ స్లాబ్‌ను తీసుకొస్తోంద‌ని పేర్కొన్నారు. గ‌ర్బ‌ర్ సింగ్ ట్యాక్స్ ద్వారా రోజూ ఉప‌యోగించే వ‌స్తువుల‌పై అధిక ప‌న్నులు విధించేందుకు సిద్ధ‌ప‌డుతోంద‌ని ఆరోపించారు. దీన్ని వ్యతిరేకిస్తూ గళమెత్తుతామన్నారు.