News March 3, 2025
7న ఏపీ క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 7న సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను ఈ నెల 5లోగా పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నందున కీలక పథకాలు, ప్రాజెక్టుల అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Similar News
News November 23, 2025
సర్పంచ్ ఎన్నికల ఖర్చు అంతే!

TG: సర్పంచ్ ఎన్నికల ఖర్చు విషయంలో ఎన్నికల సంఘం అధికారులు మరోసారి స్పష్టత ఇచ్చారు. 2011 సెన్సెస్ ఆధారంగా ఖర్చు ఉంటుందని వెల్లడించారు. 5వేల ఓటర్లకు పైగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, 5 వేల లోపు పంచాయతీల్లో రూ.1.50 లక్షలు, 5 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులకు రూ.50 వేలు, 5 వేలకు తక్కువగా ఉన్న గ్రామాల్లో రూ.30 వేల చొప్పున ఖర్చు పెట్టాల్సి ఉంటుందని వివరించారు.
News November 23, 2025
వాన్ Vs వసీం.. ఈసారి షారుఖ్ మూవీ పోస్టర్‌తో!

యాషెస్ తొలి టెస్టులో ENG ఓటమితో ఆ జట్టు మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్‌ను భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేశారు. మ్యాచ్ 2వ రోజు ENG ఆధిపత్యం చెలాయిస్తుందని వాన్ చెప్పారు. కానీ హెడ్ చెలరేగడంతో AUS గెలిచింది. దీంతో వసీం ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ ఫొటో పోస్ట్ చేసి ‘Hope you’re okay @michaelvaughan’ అని పేర్కొన్నారు. గతంలోనూ IND, ENG మ్యాచుల సందర్భంలో పుష్ప, జవాన్ మీమ్స్‌తో వసీం ట్రోల్ చేశారు.
News November 23, 2025
పిల్లల్లో ఆటిజం ఉందా? ఇలా చేయండి

ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.


