News March 3, 2025
7న ఏపీ క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 7న సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను ఈ నెల 5లోగా పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నందున కీలక పథకాలు, ప్రాజెక్టుల అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Similar News
News March 25, 2025
డైరెక్టర్ భారతీరాజా కుమారుడు మృతి

తమిళ ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా(48) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన తాజ్‌మహల్, అల్లీ అర్జున, అన్నక్కోడి, పల్లవన్, తదితర తమిళ చిత్రాల్లో నటించారు.
News March 25, 2025
అత్యంత విలువైన స్టీల్ కంపెనీగా JSW స్టీల్ రికార్డ్

ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టీల్ కంపెనీగా JSW స్టీల్ రికార్డు సృష్టించింది. $30.31B మార్కెట్ విలువను సాధించింది. $90Mతో ఆర్సెలార్ మిత్తల్, $3Bతో న్యూకోర్ కార్ప్‌ను వెనక్కి నెట్టేసింది. ఈ భారతీయ కంపెనీ విజయనగర, డోల్వి, సేలమ్‌లో ప్లాంట్లు, అమెరికా, ఇటలీలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత 35.7MT ఉత్పత్తి సామర్థ్యాన్ని FY28లో 43.5 MT, FY31లో 51.5 MTకి పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.
News March 25, 2025
BIG NEWS: ఏప్రిల్ 1 నుంచి ‘సదరమ్’ స్లాట్లు

AP: దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సామాజిక పింఛన్ల తనిఖీ కోసం కొంతకాలంగా నిలిపివేసిన సదరమ్ స్లాట్లను ఏప్రిల్ 1 నుంచి పున:ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఏరియా, జిల్లా, టీచింగ్ ఆస్పత్రులు/GGHలలో ప్రతి మంగళవారం స్లాట్‌లు అందుబాటులో ఉంటాయని సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఎ.సిరి తెలిపారు. పరీక్షల అనంతరం అర్హులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.