News January 17, 2025

నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్, పలు రంగాల్లో పెట్టుబడులు, భూముల కేటాయింపులు వంటి అంశాలపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం చంద్రబాబు తన నివాసంలో టీడీపీ మంత్రులు, ఎంపీలు, జోనల్ ఇంఛార్జ్‌లతో సమావేశం కానున్నారు.

Similar News

News July 6, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: రేవంత్
* ఈనెల 12 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి
* ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
* చర్చకు ప్రిపేరయ్యేందుకు 72 గంటల సమయం: కేటీఆర్
* మహిళలకు 5వేల ఈవీ ఆటోలు: మంత్రి పొన్నం
* AP: వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
* 20,494 ఎకరాల భూ సమీకరణకు CRDA ఆమోదం: మంత్రి

News July 6, 2025

టెస్టు చరిత్రలో తొలిసారి

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.

News July 6, 2025

పట్టు బిగించిన భారత్.. మరో 7 వికెట్లు తీస్తే..

image

ENGతో రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. 608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రాలే(0), డకెట్(25), రూట్(6) ఔటయ్యారు. ఆకాశ్‌దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ గెలవాలంటే రేపు ఒక్కరోజే 536 రన్స్ చేయాలి. మరో 7 వికెట్లు తీస్తే టీమ్ ఇండియా గెలుస్తుంది. కాగా రెండో ఇన్నింగ్సులో భారత కెప్టెన్ గిల్ (161) సెంచరీతో మెరిశారు.