News September 18, 2024

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ భేటీ జరగనుంది. నూతన మద్యం పాలసీ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపనుంది. పోలవరం, అమరావతికి కేంద్ర సహాయం, వరద నష్టం, పరిహారం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనుంది. అలాగే కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్‌ను సీఎం వెల్లడించనున్నారు.

Similar News

News October 11, 2024

డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌ట‌న‌పై స్పందించిన కేజ్రీవాల్‌

image

అధికారంలోకొస్తే ఏడాదిలోపు విద్యుత్ ఛార్జీల‌ను స‌గానికి త‌గ్గిస్తాన‌న్న డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌ట‌న‌పై EX CM కేజ్రీవాల్ స్పందించారు. ‘ఉచితాలు అమెరికా వ‌ర‌కు చేరుకున్నాయి’ అని ట్వీట్ చేశారు. అయితే, NDA పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమ‌లు చేస్తే BJP తరఫున ప్ర‌చారం చేస్తాన‌ని కేజ్రీవాల్ ఇటీవల స‌వాల్ విసిరారు. తాజాగా ట్రంప్ ప్రకటనపై స్పందించడం వెనుక ఆయన BJPని టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.

News October 11, 2024

జపాన్‌ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం

image

2024 ఏడాదికి గానూ నోబెల్ శాంతి బ‌హుమ‌తి జపనీస్ సంస్థ నిహాన్ హిడాంక్యోను వ‌రించింది. అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్టు కమిటీ ప్రకటించింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 111 మంది స‌భ్యులు, 31 సంస్థ‌ల‌ను నోబెల్ శాంతి బ‌హుమ‌తి వ‌రించింది. ఈ ఏడాది పుర‌స్కారానికి 286 నామినేష‌న్ల‌ను ప‌రిశీలించిన క‌మిటీ నిహాన్ హిడాంక్యోను పుర‌స్కారానికి ఎంపిక చేసింది.

News October 11, 2024

ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శ్రుతి హాసన్ ఆగ్రహం

image

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం ఆలస్యం కావడం పట్ల నటి శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు. ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ‘నేను సాధారణంగా ఫిర్యాదులు చేయను. ఇండిగో.. మీరు సేవల్లో ఎప్పటికప్పుడు దిగజారుతున్నారు. నాలుగు గంటలుగా ఎయిర్‌పోర్టులోనే మగ్గుతున్నాం. దీనిపై మీ నుంచి కనీస సమాచారం లేదు. మీ పాసింజర్ల కోసం మెరుగైన మార్గాల్ని అన్వేషించండి. ప్లీజ్’ అని కోరారు.