News January 1, 2025
రేపు ఏపీ క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు ఉ.11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. కొత్త సంవత్సరంలో ప్రారంభించాల్సిన పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది. క్యాబినెట్ భేటీ తర్వాత సీఎం విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై జిందాల్ ప్రతినిధులతో భేటీ కానున్నారని సమాచారం.
Similar News
News October 15, 2025
ఐడియా అదిరింది కానీ.. సాధ్యమేనా!

దేశవ్యాప్తంగా వెండి ధరల్లో భారీ తేడాలున్నాయి. అహ్మదాబాద్లో కేజీ వెండి రూ.1,90,000 ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో అది రూ.2,07,000 ఉంది. అంటే ఏకంగా రూ.17,000 వ్యత్యాసం ఉందన్నమాట. దీనిపై ఒక నెటిజన్ ‘అహ్మదాబాద్లో కొని ఇక్కడ అమ్మితే ఖర్చులు, ట్యాక్సులు పోనూ రూ.14 వేలు మిగులుతాయి’ అని పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. అయితే ఇది రియాల్టీలో సాధ్యం కాదని, లీగల్ సమస్యలొస్తాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
News October 15, 2025
విజయ్ ఆలస్యమే తొక్కిసలాటకు కారణం: స్టాలిన్

కరూర్ సభకు టీవీకే చీఫ్ విజయ్ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు కారణమని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ ఘటనపై ఇవాళ అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ర్యాలీకి వచ్చినవారికి టీవీకే పార్టీ ప్రాథమిక సౌకర్యాలు కల్పించలేదని సీఎం ఆరోపించారు. అటు ప్రజలను అదుపు చేయడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని ప్రతిపక్ష నేత పళనిస్వామి విమర్శించారు.
News October 15, 2025
కేరళలో కెన్యా మాజీ ప్రధాని మృతి

కేరళ(కొచ్చి)లోని ఆయుర్వేద కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెన్యా మాజీ PM రైలా ఒడింగా(80) గుండెపోటుతో మరణించారు. ఉదయం ఆసుపత్రి ఆవరణలో వాకింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. సమీపంలోని హాస్పిటల్కు తరలించగా ఉ.9.52కు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఒడింగా మృతిపై FRROకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. 2008-13 కాలంలో ఆయన కెన్యా PMగా వ్యవహరించారు.