News January 1, 2025

రేపు ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు ఉ.11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. కొత్త సంవత్సరంలో ప్రారంభించాల్సిన పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది. క్యాబినెట్ భేటీ తర్వాత సీఎం విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై జిందాల్ ప్రతినిధులతో భేటీ కానున్నారని సమాచారం.

Similar News

News January 17, 2025

రూ.446 కోట్ల పెండింగ్ బిల్లులు రిలీజ్

image

TG: సీఎం రేవంత్ ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖలో రూ.446 కోట్ల పెండింగ్ బకాయిలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. వీటిలో రూ.300 కోట్ల ఉపాధి హామీల పనుల బిల్లులు, రూ.146 పారిశుద్ద్య కార్మికుల వేతనాలకు చెల్లించనున్నారు. త్వరలోనే మరిన్ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ-కుబేర్ ద్వారా పారిశుద్ద్య కార్మికుల వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

News January 17, 2025

7 కోట్లు దాటిన భక్తజనం.. రష్యన్ బాబాను చూశారా?

image

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. గంగా త్రివేణీ సంగమంలో పుణ్య స్నానమాచరించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. గత ఐదు రోజుల్లో 7 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చారని సమాచారం. ఈ మేళాలో రష్యన్ సాధువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏడడుగుల ఎత్తున్న ఆయనను పలువురు పరశురాముడిగా పిలుస్తున్నారు. ఆయన టీచింగ్ కెరీర్‌ను వదిలేసి నేపాల్‌‌లో ఉంటున్నారు.

News January 17, 2025

పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు: నాదెండ్ల

image

AP: సూపర్ సిక్స్‌లో భాగంగా ఉచిత గ్యాస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలో ‘తల్లికి వందనం’ అమలు చేస్తామన్నారు. Dy.CM పవన్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని చెప్పారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.