News June 19, 2024
జగన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ

AP: ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నీచర్, ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే తమకు అప్పగించాలని జగన్‌కు సాధారణ పరిపాలన శాఖ(GAD) లేఖ రాసింది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రభుత్వ నిధులతో ఫర్నీచర్ సహా పలు వస్తువులను తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం కోసం కొనుగోలు చేయించారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత వాటిని ప్రభుత్వానికి ఇంకా సరెండర్ చేయకపోవడంతో GAD రంగంలోకి దిగి అప్పగించాలని కోరింది.
Similar News
News March 24, 2026
విగ్రహాల పరిమాణం ఎంత ఎత్తు వరకు ఉండవచ్చు?

ఇంట్లో విగ్రహాలు రెండున్నర అంగుళాల నుంచి 6 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదు. మరీ పెద్ద విగ్రహాలు ఉంటే వాటికి శాస్త్రోక్తంగా నిత్యం అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది. లోహపు విగ్రహాలైతే పంచలోహాలు, వెండి లేదా రాగితో చేసినవి ఉత్తమం. విగ్రహాలకు ఎటువంటి పగుళ్లు ఉండకూడదు. ఒకే దేవుడి విగ్రహాలు రెండు కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవడం చాలా మంచిది. శివలింగం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.
News March 24, 2026
AP హైకోర్టులో 300 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల

AP: రాష్ట్ర హైకోర్టులో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 19వ తేదీ దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.20,000-1,47,760. విద్యార్హతలు, ఇతర వివరాలకు వెబ్‌సైట్: https://aphc.gov.in/
News March 24, 2026
వరికి మానిపండు తెగులు ముప్పు.. ఎలా నివారించాలి?

ఇటీవల కురిసిన వర్షాలు, తేమ వాతావరణం వల్ల వరి పంటలో మానిపండు తెగులు కనిపిస్తోంది. దీన్ని కలగజేసే శిలీంధ్రం వరి వెన్నులోని గింజల్లోకి ప్రవేశించి గింజలపై పసుపు రంగులో గుండ్రని ముద్ద లేత పువ్వులాగ మారుతుంది. క్రమేపీ ఇది నలుపు పొడిగా మారి వెన్నులో గింజలను నల్లగా మారుస్తుంది. మానిపండు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.


