News June 19, 2024
జగన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ
AP: ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నీచర్, ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే తమకు అప్పగించాలని జగన్‌కు సాధారణ పరిపాలన శాఖ(GAD) లేఖ రాసింది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రభుత్వ నిధులతో ఫర్నీచర్ సహా పలు వస్తువులను తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం కోసం కొనుగోలు చేయించారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత వాటిని ప్రభుత్వానికి ఇంకా సరెండర్ చేయకపోవడంతో GAD రంగంలోకి దిగి అప్పగించాలని కోరింది.
Similar News
News September 17, 2024
వారి ఖాతాల్లో ఏడాదికి రూ.12,000
TG: భూమి లేని నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.12 వేలు జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం(D) నాగులవంచలో దళిత బంధు 2వ విడత లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేశారు. త్వరలోనే పేదలకు ఇళ్లు ఇస్తామన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించకపోతే రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్లేనని పేర్కొన్నారు.
News September 17, 2024
భారత ప్లేయర్లను ఉత్సాహపరచండి: ఆనంద్
చెస్ ఒలింపియాడ్-2024లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. ‘మీరు Chess Olympiad 2024లో భారత్ ఏ స్థాయిలో ఉందో తప్పకుండా తెలుసుకోవాలి. రౌండ్ 6 తర్వాత ఓపెన్ & మహిళల విభాగాల్లో భారత్ ఆధిక్యంలో ఉంది. వారిని ఉత్సాహపరచండి. ప్రపంచంలోని టాప్-5లో ఇద్దరు భారత ప్లేయర్లు ఉండటం ఇదే తొలిసారి’ అని ట్వీట్ చేశారు.
News September 17, 2024
నాక్కూడా CM కావాలనుంది: అజిత్ పవార్
CM పదవిపై NCP చీఫ్ అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి ఒక్కరూ తమ నాయకుడు CM కావాలని కోరుకుంటారు. నాకు కూడా ఆ కోరిక ఉంది. అయితే సీఎం అవ్వడానికి మెజారిటీ మార్క్ చేరుకోవాలి. ప్రతి ఒక్కరికి కోరుకున్నది దక్కదు. అయితే, దానికోసం అంబేడ్కర్ ఓటు హక్కును కల్పించారు. అంతిమంగా అది ఓటర్ల చేతిలోనే ఉంది. 288 మంది ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ 145 మార్క్ చేరుకోవాలి’ అని పేర్కొన్నారు.