News March 3, 2025

అత్యధిక TVలు ఉన్నది ఏపీలోనే

image

అసర్-2024 నివేదిక ఆధారంగా దేశంలోనే అత్యధిక టీవీలు ఉన్న రాష్ట్రంగా AP నిలిచింది. ఈ రాష్ట్రంలో 95.1% ఇళ్లలో టీవీలు ఉన్నాయి. ఆ తర్వాత TNలో 94.5%, పంజాబ్‌లో 93.7% ఇళ్లలో ఉన్నాయి. యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాల్లో 50%లోపు ఇళ్లలోనే టీవీలు ఉన్నాయి. కర్ణాటక (89.9), కేరళ (89.3), తెలంగాణ (87), మహారాష్ట్ర (79.6), గుజరాత్ (69.5), పశ్చిమ బెంగాల్ (48.4), ఉత్తరప్రదేశ్(43%)లో ఉన్నట్లు తేలింది.

Similar News

News March 20, 2025

రోజూ డబ్బు ఇస్తేనే భార్య కాపురం చేస్తానంటోంది: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

image

రోజూ రూ.5,000 ఇస్తేనే భార్య తనతో కాపురం చేస్తానంటోందని బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించాడు. WFH జూమ్ కాల్స్ వేళ భార్య కొట్టేదని, ల్యాప్‌టాప్ ముందు డాన్స్ కూడా చేయడంతో జాబ్ పోయిందని తెలిపాడు. 60 ఏళ్లు వచ్చే వరకు పిల్లలు వద్దంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. విడాకులు అడిగితే రూ.45లక్షలు డిమాండ్ చేస్తోందన్నాడు. అయితే మరో పెళ్లి కోసమే భర్త ఇలా ఆరోపిస్తున్నాడని భార్య చెబుతోంది.

News March 20, 2025

చంద్రబాబుతో భేటీపై బిల్‌గేట్స్ ట్వీట్

image

మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నిన్న భేటీ అయి పలు ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై బిల్‌గేట్స్ ట్వీట్ చేశారు. ‘బిల్‌గేట్స్ ఫౌండేషన్‌ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు సీఎం చంద్రబాబును కలవడం సంతోషం. వైద్యం, వ్యవసాయం, విద్యలో ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి రాష్ట్రానికి మద్దతునిస్తూ వారితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News March 20, 2025

మన ‘సంతోషం’ తక్కువేనట..

image

ప్రపంచ సంతోష సూచీలో వరుసగా 8వ సారి ఫిన్లాండ్ తొలి స్థానంలో నిలిచింది. 147 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 118వ స్థానంలో నిలిచింది. పొరుగు దేశాలు నేపాల్(92), PAK(109) భారత్ కంటే ముందు స్థానాల్లో ఉన్నాయి. అయితే గత ఏడాది(126)తో పోలిస్తే ఇండియా తన పొజిషన్‌ను కాస్త మెరుగుపరుచుకుంది. కాగా సామాజిక మద్దతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులు ఇస్తారు.

error: Content is protected !!