News December 6, 2024

నాలెడ్జ్ హబ్‌గా ఏపీ తయారవుతోంది: సీఎం చంద్రబాబు

image

AP: ప్రపంచంలో ఎక్కడ చూసినా సాంకేతికతపైనే చర్చ జరుగుతోందని, అది మనిషి జీవితంలో భాగమైందని CM చంద్రబాబు చెప్పారు. విశాఖలో జరుగుతున్న డీప్‌టెక్ సదస్సులో మాట్లాడుతూ ‘టెక్నాలజీకి మేం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. నూతన సాంకేతిక ఆవిష్కరణల్లో ఇతర దేశాలతో పోటీ పడుతున్నాం. నాలెడ్జ్ హబ్‌గా AP తయారవుతోంది. ప్రస్తుతం డ్రోన్లు కూడా కీలకంగా మారాయి. అన్ని పనులు డ్రోన్ల ద్వారా చేసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

Similar News

News January 23, 2026

ఖలిస్థానీల దుశ్చర్య.. త్రివర్ణ పతాకం తొలగింపు

image

క్రొయేషియాలో భారత రాయబార కార్యాలయంలోకి ఖలిస్థానీ మూకలు చొరబడ్డాయి. జాగ్రెబ్‌లోని ఎంబసీపై ఉన్న భారత త్రివర్ణ పతాకాన్ని తొలగించాయి. ఆ స్థానంలో ఖలిస్థానీ జెండాను ఎగురవేశాయి. ఈ దుశ్చర్యను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది.

News January 23, 2026

పాపం ఆ చిన్నారి.. బిక్కుబిక్కుమంటూ చూస్తూ..

image

అమెరికాలోని మిన్నెసోటాలో అక్రమ వలసలపై ICE అధికారులు <<18880489>>ఉక్కుపాదం<<>> మోపుతున్నారు. ఈ క్రమంలో ఐదేళ్ల చిన్నారి లియామ్ రామోస్‌ను డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. దీంతో చిన్నారి ఏడుస్తూ, బిక్కుబిక్కుమంటూ చూస్తుండిపోయాడు. ప్రీస్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా అధికారులు తీసుకెళ్లడంపై తీవ్ర దుమారం రేగుతోంది. రామోస్ చిన్న పిల్లాడని, ఆ పసికందును ఎరలా వాడుకోవద్దని మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మండిపడ్డారు.

News January 23, 2026

350 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 350 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి CFA/CA, MBA, PGDBA, PGDBM, PGDM, CAIIB, IIBF, CITF, NISM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు FEB 3 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22-30ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు). రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://centralbank.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.