News March 5, 2025

దక్షిణ భారత టూరిజానికి ఏపీ ముఖద్వారం: కందుల దుర్గేశ్

image

AP: జర్మనీ పర్యటనలో ఉన్న పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ రెండో రోజు బెర్లిన్ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలపై ప్రపంచ మీడియా ప్రతినిధులకు వివరించారు. ‘అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారేందుకు ఈ సదస్సు ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం. దక్షిణ భారత పర్యాటకానికి ఏపీ ముఖద్వారం. సుదీర్ఘ సముద్రతీరం, అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఏపీ సొంతం’ అని పేర్కొన్నారు.

Similar News

News December 7, 2025

NLG: స్థానిక పోరు.. కూలీలు లేరు..!

image

స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారం నల్గొండ జిల్లాలో జోరందుకుంది. అభ్యర్థులు, వారి బంధువులు, సమర్థకులు ప్రచారంలో నిమగ్నం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత తీవ్రమైంది. ఫలితంగా, ప్రస్తుతం యాసంగి సాగు పనులు చేపడుతున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు దొరకక పోవడంతో పొలాల్లో పనులు ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News December 7, 2025

గుత్తాధిపత్యం.. ఎప్పటికైనా ముప్పే! 1/2

image

ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతుండటం తెలిసిందే. విమాన సర్వీసుల్లో అగ్ర వాటా(63%) ఇండిగోది కావడంతో సమస్య తీవ్రత పెరిగింది. ఎక్కడైనా ఓ సంస్థ/కొన్ని సంస్థల <<18493058>>గుత్తాధిపత్యం<<>> ఉంటే ఆ రంగంలో మిగతా సంస్థలు నిర్వీర్యమవుతాయి. టెలికం రంగం ఇందుకో ఉదాహరణ. ఇప్పుడు 4 కంపెనీలే ఉన్నాయి. Aircel, DoCoMo, Telenor, MTNL, Reliance వంటివి విలీనమయ్యాయి లేదా దివాలా తీశాయి. విమానయాన రంగంలోనూ దాదాపు ఇదే పరిస్థితి.

News December 7, 2025

గుత్తాధిపత్యం.. ఎప్పటికైనా ముప్పే! 2/2

image

గుత్తాధిపత్యం(Monopoly) వల్ల ఆ రంగంలో సర్వీసులు పరిమితమవుతాయి. వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు అతి తక్కువ. తాము ఎంచుకునే ఏ ధరనైనా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయా సంస్థలకు ఉంటుంది. పోటీ పెద్దగా ఉండదు. కొత్త సంస్థలు ప్రవేశించాలన్నా చాలా కష్టం. చిన్న సంస్థలు వాటిలో విలీనం కావడమో, దివాలా తీయడమో జరుగుతుంది. బడా సంస్థల ఉత్పత్తి/సేవల్లో అంతరాయం ఏర్పడితే ఇండిగో లాంటి సంక్షోభం ఎదురవుతుంది. దీనిపై మీ కామెంట్?