News February 4, 2025
AP: మగాళ్ల పొదుపు సంఘాలు.. నిబంధనలు ఇవే

✒ 18-60 ఏళ్ల వయసు ఉండాలి. ఐదుగురు కలిసి ఓ గ్రూపుగా ఏర్పాటుకావొచ్చు. ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి.
✒ ప్రతినెలా కనీసం రూ.100 నుంచి రూ.1,000 వరకు పొదుపు చేయొచ్చు.
✒ 6 నెలల తర్వాత రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం ₹25K ఇస్తుంది. తర్వాత ఈ మొత్తాన్ని పెంచుకుంటూ పోతుంది.
✒ మెప్మా కార్యాలయ సిబ్బందిని కలిస్తే గ్రూపును ఏర్పాటుచేస్తారు.
Similar News
News February 10, 2025
సీఎం రేవంత్‌కు లేఖ రాసిన మందకృష్ణ

TG: ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు MRPS స్థాపకుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయి. లోపాల వల్ల కొన్ని కులాల హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. నివేదికపై చర్చించి సూచనలు ఇవ్వడానికి సీఎంను కలవాలని అనుకుంటున్నాం. సాధ్యమైనంత త్వరలో మీ విలువైన సమయాన్ని కేటాయించాలని కోరుతున్నాం’ అని లేఖలో విజ్ఞప్తి చేశారు.
News February 10, 2025
రంగరాజన్‌ను పరామర్శించిన కొండా సురేఖ

TG: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. ఆయనపై జరిగిన దాడి గురించి ఆమె ఆరా తీశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాగా పూజారిపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
News February 10, 2025
శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఉచితంగా లడ్డూ: ఆనం

AP: ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందిలేకుండా తాగునీరు, ఆహారం అందిస్తామని చెప్పారు. శ్రీశైలం పార్కింగ్ నుంచి సత్రాల వరకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ప్రతి భక్తుడికీ ఫ్రీగా లడ్డూ ప్రసాదం ఇస్తామని పేర్కొన్నారు. ఘాట్ రోడ్లపై ట్రాఫిక్‌ను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు.