News August 24, 2024

‘భారత్ నెట్’ కోసం కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

image

AP: రాష్ట్రంలో భారత్ నెట్ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 35 లక్షల CPE బాక్సులు సరఫరా చేయాలని కోరింది. ఈ ప్రాజెక్టు రెండో దశలో ఖర్చు చేసిన ₹650 కోట్లను APకి చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. APSFL ద్వారా 9.7 లక్షల గృహాలు, 6,200 స్కూళ్లు, 1,978 ఆరోగ్య కేంద్రాలు, 11,254 పంచాయతీలు, 5,800 రైతు కేంద్రాలు, 9,104 GOVT కార్యాలయాలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.

Similar News

News December 13, 2025

SBIలోనూ వడ్డీ రేట్లు తగ్గాయ్

image

<<18500647>>RBI<<>> రెపో రేటును 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో SBI కూడా రుణ రేట్లను సవరించింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేటు(EBLR)ను 7.90 శాతానికి కుదించింది. MCLRను 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.70 శాతానికి చేరింది. అలాగే 2-3 ఏళ్ల వ్యవధి FD రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి, 444 రోజుల కాలవ్యవధి రేటును 6.45 శాతానికి పరిమితం చేసింది. ఈ రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయంది.

News December 13, 2025

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలివే..

image

40 ఏళ్లు దాటిన మహిళలు ఎప్పటికప్పుడు బ్రెస్ట్‌లో వచ్చే మార్పులను గమనిస్తుండాలని నిపుణులు సూచిస్తున్నారు. రొమ్ములో కొంత భాగం గట్టిపడటం, రొమ్ము చర్మం రంగు మారడం, చను మొన ప్రాంతంలో పుండ్లు, బ్రెస్ట్ నుంచి స్రావాలు రావడం, చంకల కింద గడ్డలు కనిపించడం అనేవి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలు. కాబట్టి రొమ్ముల్లో ఏవైనా అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 13, 2025

స్టూడెంట్ కిట్లకు రూ.830కోట్లు

image

AP: వచ్చే విద్యాసంవత్సరంలో స్టూడెంట్ కిట్ల(సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర) కొనుగోలుకు ₹830Cr విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. ఇందులో కేంద్రం వాటా ₹157Crగా ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు నోట్‌బుక్‌లు, బెల్ట్, షూలు, బ్యాగ్, డిక్షనరీ, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, యూనిఫాం క్లాత్‌లతో కిట్లు పంపిణీ చేయనుంది. అలాగే యూనిఫాం కుట్టు కూలీని కూడా పేరెంట్స్‌కు అందజేయనుంది.