News August 24, 2024

‘భారత్ నెట్’ కోసం కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

image

AP: రాష్ట్రంలో భారత్ నెట్ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 35 లక్షల CPE బాక్సులు సరఫరా చేయాలని కోరింది. ఈ ప్రాజెక్టు రెండో దశలో ఖర్చు చేసిన ₹650 కోట్లను APకి చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. APSFL ద్వారా 9.7 లక్షల గృహాలు, 6,200 స్కూళ్లు, 1,978 ఆరోగ్య కేంద్రాలు, 11,254 పంచాయతీలు, 5,800 రైతు కేంద్రాలు, 9,104 GOVT కార్యాలయాలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.

Similar News

News September 13, 2024

నేనొక సీరియల్ డేటర్: రెజీనా

image

ఇప్పటివరకు తాను ఎంతో మందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని హీరోయిన్ రెజీనా తెలిపారు. ‘ఉత్సవం’ ప్రమోషన్లలో తన లవ్ స్టోరీస్ గురించి ఆమె మాట్లాడారు. ‘నేను సీరియల్ డేటర్‌ను. చాలా మందితో రిలేషన్ కొనసాగించా. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి విశ్రాంతి తీసుకుంటున్నా. సందీప్ కిషన్‌తో నాకు అఫైర్ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం’ అని ఆమె చెప్పారు. కాగా చాలా రోజుల తర్వాత రెజీనా ‘ఉత్సవం’ మూవీలో నటించారు.

News September 13, 2024

అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు?

image

AP: రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అక్టోబర్‌లో అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దైన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

News September 13, 2024

ALERT.. మళ్లీ వర్షాలు

image

AP: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ప.బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బిహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయంది. APపై ప్రభావం స్వల్పంగానే ఉన్నా.. రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.